పెరిగిన బంగారం ధరలు..వెండి ధరలు పైకే.. ఎంతంటే..!

Update: 2020-05-15 01:17 GMT

నిన్న స్వల్పంగా దిగివచ్చిన బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి. ఈరోజు (మే15) బంగారం ధరలు దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా పెరిగాయి.

బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (15.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధర కంటే 350 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,710 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 350 రూపాయల పెరుగుదలతో 47,750 రూపాయలు నమోదు చేసింది.

స్వల్పంగా పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కేజీవెండి ధర నిన్నటి ధరల కంటే 200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 43 వేల మార్కు నుంచి వెండి ధర పైకెగసింది. కేజీ వెండి ధర 43,150 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధర కంటే 350 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,7170 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 350 రూపాయల పెరుగుదలతో 47,750 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 43,000 రూపాయల కంటే పైకెగసి 43,150 రూపాయలు నమోదు చేసింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పైకి కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు 250 రూపాయలు పెరిగి 47,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 250 రూపాయల పెరుగుదలతో 45,200 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా కేజీకి 200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 43 వేల మార్కు నుంచి పైకెగసింది. కేజీ వెండి ధర 43,150 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News