Gold Rate Today: హోలీ పండగకు ముందే బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ..తాజా ధరలు ఇవే
Gold Rate Today: దేశంలో హోలీ పండగకు ముందే పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. నిన్నటితో పోల్చితే నేడు అనగా మార్చి 13వ తేదీ గురువారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం నేడు హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 87,980కి చేరింది. ఇది నిన్నటితో పోల్చితే రూ. 630 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 80, 650గా ఉంది. ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 88, 140కి చేరుకోగా..22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 80, 810కి చేరింది.
మరోవైపు దేశీయ మార్కెట్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం వెండి ధరలు ఢిల్లీలో కిలోకు రూ. 1,00,100 స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పూణే, లక్నో, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో వెండి ధరలు ఏకంగా రూ. 2200 పెరిగి రూ. 109,100 స్థాయికి చేరాయి.