Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎగసిన వెండి ధరలు!

Gold Rate: బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి మళ్ళీ పైకెగసింది. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

Update: 2020-10-13 01:45 GMT

నిన్న కొద్దిగా పెరుగుదల కనబరిచిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (13.10.2020) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు ఇటీవల పైచూపులు చూస్తున్న వెండి ధరలు ఈరోజు కూడా అదే స్థాయిలో పైకెగశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (13.10.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు పెరిగి 48,870 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 60 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,310 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు స్వల్ప పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు ఈరోజు భారీ పెరుగుదల కనబరిచాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరల కంటె పెరిగాయి. ఈరోజు వెండి ధర కేజీకి 890 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 63వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 63,800 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. మంగళవారం (13.10.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు పెరిగి 48,870 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 60 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,310 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు పైకెగశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 190 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,800 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 360 రూపాయల పెరుగుదల కనబరిచింది. దాంతో 54,330 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. ఇక్కడ కూడా కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరల కంటె పెరిగాయి. ఈరోజు వెండి ధర కేజీకి 890 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 63వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 63,800 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News