బంగారం ధర కిందికి.. వెండి ధరా తగ్గింది!

Update: 2020-02-12 02:26 GMT

వరుసగా రెండోరోజూ బంగారం ధరలు తగ్గాయి. నిన్న స్వల్ప తగ్గుదల నమోదు చేసిన బంగారం ఈరోజు మరింత కిందికి దిగివచ్చింది. నిన్నటి ధరల కంటే ఈరోజు (12.02.2020) బంగారం ధర మరికాస్త  తగ్గింది. 

స్వల్పంగా తగ్గిన బంగారం..

హైదరాబాద్ లో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర 290 రూపాయలు తగ్గింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు 42,530 నుంచి 42,240 రూపాయలకు దిగివచ్చింది. ఇక, 22 క్యారెట్ల బంగారం ధర కూడా 290 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం 38,980 నుంచి 38,690 రూపాయలకు చేరింది.

వెండిధరలూ తగ్గుముఖం..

నిన్న కస్తాపెరుగుదల నమోదు చేసిన వెండి ధరలు ఈరోజు అదే స్థాయిలో కిందికి దిగోచ్చాయి. కేజీ వెండి ధర 300 రూపాయలు తగ్గింది. దీంతో .49,300 నుంచి 49,000 రూపాయలకు చేరింది.

విశాఖ, విజయవాడలో ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గుదలతో 10 గ్రాములకు 38,690కు చేరింది. వెండి ధర 49,000 రూపాయలుగా అయింది.

దేశ రాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 300 తగ్గింది. దీంతో ధర 40,700కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 తగ్గి 39,500కు చేరింది. ఇక కేజీ వెండి ధర 300 తగ్గుదలతో రూ.49,000కు పడిపోయింది.

Tags:    

Similar News