Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. లక్ష దిశగా తులం బంగారం ధర.. సరికొత్త రికార్డ్
Gold Rate Today: బంగారం ధరలు బ్రేకులు లేకుండా పోతోంది. రోజు రోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. సామాన్యులు కొనుగోలు చేయలేని స్థితిలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర ఏకంగా రూ. 88,500 వద్ద గరిష్టానికి తాకింది. నిన్నటి ధరతో పోల్చితే రూ. 2430 పెరిగింది. గతవారం 99.9 స్వచ్చమైన 10 గ్రాముల పసిడి ధర రూ. 86,070 వద్ద ఉంది. ఒక్కసారి రెండు వేల రూపాయలు పెరగడం అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి క్షీణత వల్ల బంగారం ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇక రిటైల్ గా దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు 22క్యారెట్లు గ్రాముకు చెన్నైలో 7,980, ముంబైలో రూ. 7,980 ఉండగా ఢిల్లీలో రూ. 7,995 కోల్ కొతాలో రూ. 7,980 ఉంది. బెంగళూరులో రూ. 7,980, హైదరాబాద్ రూ 7,980, కేరళలో రూ. 7,980 పూణేలో రూ. 7,980 గా ఉంది. 24క్యారెట్ల బంగారం గ్రాముకు చెన్నైలో రూ. 8,706 ఉండగా, ముంబైలో రూ. 8,706 పలుకుతోంది. అటు ఢిల్లీలో రూ 8,721 కాగా.. కోల్‌కతా రూ. 8,706, బెంగళూరులో రూ 8,706, హైదరాబాద్ రూ. 8,706 పలుకుతోంది. 24 క్యారెట్ గ్రాముకు నిన్నటితో పోల్చితే రూ.39 పెరిగింది. దీంతో 100 గ్రాములకు 3900 మేరకు చేరుకుంది.