రెండురోజులుగా ఉపశమించినట్టుగా కనిపించిన బంగారం ధరలు మళ్ళీ పైకెగాశాయి. వెండి ధరలు మాత్రం కాస్త దిగొచ్చాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (11.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 180 రూపాయల పెరుగుదల నమోదు చేసి 42,160 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 180 రూపాయల పెరుగుదలతో 45,980 రూపాయలు నమోదు చేసింది.
భారీగా తగ్గిన వెండి ధరలు...
నిన్న కాస్త తగ్గిన వెండి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. దీంతో 50 వేల మార్కునుంచి దిగొచ్చిన కేజీ వెండి ధర 1000 రూపాయల తగ్గుదల నమోదు చేసి 48,500 రూపాయలుగా నిలిచింది.
విజయవాడ, విశాఖపట్నం లలో..
ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 180 రూపాయల పెరుగుదల నమోదు చేసి 42,160 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు180 రూపాయల పెరుగుదలతో 45,800 రూపాయలు నమోదు చేసింది. అదేవిధంగా వెండి ధరలు కూడా భారీగా తగ్గడంతో కేజీకి 48,500 రూపాయలుగా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో..
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం ధరల్లో ఎటువంటి మార్పూలేదు. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,050 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 42,850 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా భారీగా తగ్గుదల నమోదు చేసి 48,500 రూపాయలుగా ఉంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 11-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.