Gold Rate: శుభవార్త! దిగివచ్చిన బంగారం ధరలు.. వెండి ఢమాల్..ఎంత తగ్గాయంటే..

Gold Rate: బంగారం ప్రియులకు శుభవార్త. ఈరోజు బంగారం ధరలలో భారీ తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధరలు ఏకంగా భారీస్థాయిలో దిగివచ్చాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2021-01-10 01:20 GMT

బంగారం ధరలు శనివారం భారీ తగ్గుదల కనబరిచాయి. దీంతో ఆదివారం మార్కెట్లు తగ్గుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతొ పోలిస్తే భారీగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (10.01.2021) తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆదివారం (10.01.2021) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలకంటె భారీస్థాయిలో తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా 1200 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 46,300 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 50 వేలరూపాయల మార్క్ వద్దకు దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1300 రూపాయల భారీ తగ్గుదల నమోదు చేసి 50,500 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోతే.. వెండి ధరలు అమాంతం కిందికి దిగోచ్చాయి. రికార్డు స్థాయిలో తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర ఐదు వేల రూపాయలకు పైగా తగ్గింది. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరకంటె 5500 రూపాయలు తగ్గింది. దీంతో 69 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 69,000 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆదివారం (10.01.2021) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలకంటె భారీస్థాయిలో తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా 1200 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 46,300 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 50 వేలరూపాయల మార్క్ వద్దకు దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1300 రూపాయల భారీ తగ్గుదల నమోదు చేసి 50,500 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు కొద్దిపాటి పెరుగుదల బాటలో నడిచాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు పెరిగి 48,460 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగింది. దీంతో 52,860 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు రికార్డు స్థాయిలో తగ్గుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధర కంటె ఏకంగా 6,000 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 63 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 63,900 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News