gold Price : పెరిగిన బంగారం ధరలు.. భారీ షాకిచ్చిన వెండి!

Update: 2020-05-09 02:08 GMT

నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు పెరుగుదల కనబరిచాయి. ఈరోజు (మే 9) బంగారం ధరలు దేశీయంగా పై పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు షాకిచ్చాయి. ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదు చేశాయి.

బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (09.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధర కంటే 350 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,490 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 350 రూపాయల పెరుగుదలతో 47,250 రూపాయలు నమోదు చేసింది.

భారీగా పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు మాత్రం భారీ పెరుగుదల నమోదు చేశాయి. కేజీకి ఏకంగా 1450 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 43 వేల మార్కును దాటి వెండి ధర నిలిచింది. కేజీ వెండి ధర 43,500 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 350 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,390 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 350 రూపాయల పెరుగుదలతో 47,250 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 43,500 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70 రూపాయలు పెరిగి 46,530 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయల పెరుగుదలతో 44,750 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర 43 వేల మార్కు దాటిపోయింది. కేజీ వెండి ధర 43,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News