శుభవార్త..భారీగా తగ్గిన బంగారం..వెండి ధరలు!

Update: 2020-06-08 02:06 GMT

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 08) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు భారీగా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. సోమవారం (08.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 490 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 44,280 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు ఏకంగా 1600 రూపాయలు తగ్గింది. దీంతో 47,230 రూపాయలకు చేరింది.

స్వల్పంగా తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరల తో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే 1070 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 47వేల మార్కుకు దిగి వచ్చింది. కేజీ వెండి ధర 47,410 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 490 రూపాయలు తగ్గుదల నమోదు చేసి, 44,280 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 1600 రూపాయల తగ్గుదల నమోదు చేసి 47,410 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 47,410 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి.. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 290 రూపాయలు తగ్గి 45,010 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 290 రూపాయల తగ్గుదల తో 46,210 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 1070 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 47 వేల మార్కుకు  దిగి వచ్చి 47,410 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News