వామ్మో! ఈ వారం బంగారం దూకుడు.. వెండి ధరలు ఆకాశంలో.. ఎంత పెరిగాయో తెలుసా?
పసిడి ఈ వారంలో మార్కెట్ ను కుదిపేసింది. వెండి కూడా పసిడితో సమానంగా పరుగులు తీసింది. రికార్డు స్థాయి పెరుగుదలను నమోదు చేసి బంగారం సామాన్యులకు షాకిచ్చింది. ఈ వారం ప్రారంభం నుంచి ముగింపు సమయానికి 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం 2,200 రూపాయలు పెరిగింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 2,200 రూపాయలు పైకెగసింది. ఇక వెండి కూడా తానేమీ తక్కువకాదన్నట్టు పై పై కి దూసుకుపోయింది. ఈ వారం ప్రారంభ ధర నుంచి వారాంతానికి కేజీ వెండి ధర అమాంతం 2580 రూపాయలు పెరిగింది.
దూసుకుపోయిన బంగారం..
గత సోమవారం (02.03.2020) బంగారం 22 క్యారెట్ల ధర పది గ్రాములకు 39,870 రూపాయల వద్ద ప్రారంభం అయింది. ఆ రోజు స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 43,670 రూపాయల నుంచి స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. ఆ తరువాత స్వల్పంగా కదులుతూ వచ్చిన బంగారం ధరలు రికార్డు స్థాయిలో బుధవారం (04.03.2020) రోజు పైకేగశాయి. కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించిందనే వార్తలు.. డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలతో ఒక్కసారిగా బంగారం ధరలు దూసుకుపోయాయి. 22 క్యారెట్ల ధర పది గ్రాములకు దాదాపుగా 1400 రూపాయల పెరుగుదలతో 41,530 రూపాయల వద్దకు చేరుకుంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 1400 రూపాయల పెరుగుదలతో 45,310 రూపాయలకు ఎగబాకింది. ఇక తరువాతి రోజు కాస్త ఉపశమించినట్టు కనిపించినా ఒక్క రోజు విరామమిచ్చి తిరిగి శనివారం(07.03.2020) రికార్డు పెరుగుదల నమోదు చేశింది బంగారం. ఆరోజు 22 క్యారెట్ల బంగారం 42,310 రూపాయలకు చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం 46,610 రూపాయలకు చేరుకుంది. ఇక ఈ రోజు (ఆదివారం, 08.03.2020) ఉదయం 7 గంటల సమయానికి బంగారం ధరలు కాస్త తగ్గి 22 క్యారెట్ల బంగారం 42,070 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 45,890 రూపాయలుగానూ ఉన్నాయి.
వెండి మిల మిల..
ఇక బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఇదే విధంగా పరుగులు తీశాయి. గత సోమవారం (02.03.2020) కేజీ వెండి ధర 48,500 రూపాయల వద్ద ప్రారంభం అయింది. వారాంతానికి అది కేజీకి 51,080 రూపాయలకు చేరుకుంది. మధ్యలో పైకీ కిందకీ కదిలినా భారీ పెరుగుదలను నమోదు చేసిన వెండి ధరలు ఈ వారాంతం (ఆదివారం, 08.03.2020) ఉదయం 7 గంటల సమయానికి కేజీకి 51,080 రూపాయలుగా ఉంది.
మొత్తమ్మీద ఈ వారం అంతా బంగారం, వెండి ధరలు చుక్కలనంటే విధంగానే పరుగులు తీశాయని చెప్పవచ్చు. ఇంకా కరోనా భయం తొలగిపోక పోవడం, రూపాయి మారకం విలువలో పెద్దగా మార్పు రాకపోవడం వంటి కారణాలు కొనసాగుతుండడం తో వచ్చే వారం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా పరుగులు తేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక్కడ ఇచ్చిన ధరలు మార్కెట్ వర్గాల నుంచి సేకరించి ఇచ్చినవి, దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ ఆధారంగా ఈ కథనం ఇవ్వడం జరిగింది. బంగారం, వెండి ధరలు వివిధ అంశాలకు లోబడి నిత్యం మార్పులూ..చేర్పులకు గురవుతుంటాయి. బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలన చేసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.