Gold Rate: శుభవార్త! దిగివచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు కిందికి!

Gold Rate: నిన్న భారీగా ఎగసిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా కిందికి దిగివచ్చాయి. ఈరోజు బంగారం ధరలలో తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధరలు కూడా కిందికి దిగివచ్చాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2021-01-08 01:08 GMT

పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గుదల కనబరిచాయి. దీంతో శుక్రవారం మార్కెట్లు తగ్గుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతొ పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (08.01.2021) తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. శుక్రవారం (08.01.2021) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలకంటె తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 47,500 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 51 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా దిగొచ్చింది. పడి గ్రాముల 24 క్యారెట్ల బంగారం 510 రూపాయల తగ్గుదల నమోదు చేసి 51,850 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు కిందికి దిగొస్తే.. వెండి ధరలు కూడా కొద్దిగా దిగివచ్చాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరకంటె 900 రూపాయలు తగ్గింది. దీంతో 74 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు నిలిచాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 74,200 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా శుక్రవారం (08.01.2021) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలకంటె తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 47,500 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 51 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా దిగొచ్చింది. పడి గ్రాముల 24 క్యారెట్ల బంగారం 510 రూపాయల తగ్గుదల నమోదు చేసి 51,850 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల బాటలో నడిచాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధర కంటె 410 రూపాయలు తగ్గి 49,650 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయలు తగ్గింది. దీంతో 54,160 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు తగ్గుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధర కంటె 1,700 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 69 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 69,700 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News