పెరిగిన బంగారం ధరలు..స్వల్పంగా తగ్గిన వెండి!
బంగారం ధరలు కాస్త పైకెగాశాయి . బంగారంధరలు ఈరోజు (జూన్ 06) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి.
బంగారం ధరలు కాస్త పైకెగాశాయి . బంగారంధరలు ఈరోజు (జూన్ 06) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (06.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధర కంటే 190 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 44,750 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 190 రూపాయలు పెరిగింది. దీంతో 48,830 రూపాయలకు చేరింది.
స్వల్పంగా తగ్గిన వెండి ధరలు...
బంగారం ధరలు కొద్దిగా పెరిగితే, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే 20 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రికార్డు మార్కు నుంచి కిందికి దిగి వచ్చింది. కేజీ వెండి ధర 48,480 రూపాయలకు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధర కంటే 190 రూపాయలు పెరుగుదల నమోదు చేసి, 44,750 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 190 రూపాయల పెరుగుదల నమోదు చేసి 48,830 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 48,480 రూపాయల వద్దకు చేరింది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలో బంగారం ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిలకడగా 46,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా హెచ్చు తగ్గులు లేకుండా 45,300 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 20 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 50 వేల రికార్డు మార్కు నుంచి కిందికి దిగి వచ్చి 48,480 రూపాయలుగా నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.