Gold Rate: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rate: బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2021-04-02 01:33 GMT

గోల్డ్ రేట్ 

బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత వారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 02) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (01.04.2021) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయలు పెరిగి 42,000 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 600 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45,440 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా కాస్త పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరలతో పోలిస్తే కాస్త పెరిగింది. ఈరోజు వెండి ధరల్లో పెద్దగా మార్పులూ లేవు. కేజీ వెండి మరో 1400 రూపాయలు పెగిరి.. 68వేల రూపాయల వద్ద ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 68,700 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం(01.04.2021) గత కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుదల నమోదు చేసాయి. గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయలు పెరిగి 41,650 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 600రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45,440 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే మార్పులు లేకుండా 43,800 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ధరతో పోలిస్తే 47,790 రూపాయల వద్ద నిలిచింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరల కంటే భారీగా పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 63,600 రూపాయల వద్ద నమోదు అయింది. హైదరాబాద్ ధరతో పోలిస్తే వెండి ధర ఢిల్లీలో 5,100 రూపాయలు తగ్గువగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02-04-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News