Gold Rate: వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధరలు..పైకెగసిన వెండి ధరలు!

వారం ప్రారంభం నుంచీ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు (ఏప్రిల్ 2) బంగారం ధరలు పది గ్రాములకు 70 రూపాయల వరకూ తగ్గింది. మరో వైపు వెండి ధరలు కేజీకి 460 రూపాయల పెరుగుదల కనబరిచాయి.

Update: 2020-04-02 02:41 GMT

వారం ప్రారంభం నుంచీ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గుదల నమోదు చేశాయి.  ఈరోజు (ఏప్రిల్ 2) బంగారం ధరలు పది గ్రాములకు 70 రూపాయల వరకూ తగ్గింది. మరో వైపు వెండి ధరలు  కేజీకి 460 రూపాయల పెరుగుదల కనబరిచాయి.

బంగారం ధరలు మళ్ళీ తగ్గుదల నమోదు చేశాయి. గురువారం (02.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 70 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,440 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 80 రూపాయల తగ్గుదలతో 43,080 రూపాయలు నమోదు చేసింది.

పెరుగుదల నమోదు చేసిన  వెండి ధరలు...

బంగారం ధరలు తఃగ్గితే,  వెండి ధరలు మాత్రం పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 460 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 40 వేల మార్కు దగ్గరకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,940 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 70 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,440 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 80 రూపాయల తగ్గుదలతో 43,080 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా ఇక్కడ కూడా  పెరిగాయి. వెండి ధర 39,940 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80 రూపాయల తగ్గుదలతో 43,210 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 70 రూపాయల తగ్గుదలతో 40,940 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. 40 వేల మార్కు వద్దకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,940 రూపాయల వద్దనిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News