Gold Rate: దేశీయ మార్కెట్లో క్రమేపీ పెరుగుతున్న పసిడి ధర

Gold Rate: ఎంసీఎక్స్ లో ఎల్లోమెటల్ 10 గ్రా. 160 * హైదరాబాద్ , విశాఖల్లో 24 క్యారెట్ల ఎల్లోమెటల్ ధర రూ.46,320

Update: 2021-03-16 04:47 GMT

ఫైల్ ఫోటో 

Gold Rate: దేశీయ మార్కెట్లో విలువైన లోహం పుత్తడి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. దేశీయ విఫణి మల్టీ కమోడిటీ ఎక్సేంజీ ఎంసీఎక్స్ లో ఎల్లోమెటల్ పదిగ్రాములకు 160 రూపాయల మేర పెరుగుదల నమోదు చేస్తూ 44,910 వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన స్పాట్ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగి 44,150 రూపాయలు వద్దకు చేరింది.

రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 44,150 రూపాయల వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబైలో 43,830 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ , విశాఖల్లో 22 క్యారెట్ల ధర 42,010 గా నమోదు కాగా 24 క్యారెట్ల ధర 46,320 రూపాయల వద్దకు చేరింది.

Tags:    

Similar News