Gold Rate Today: బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ హై.. భారీ షాక్‌లో పసిడి ప్రేమికులు!
Gold Rate Today: దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎప్పటికీ లేనంత గరిష్టానికి చేరాయి.
Gold Rate Today: బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ హై.. భారీ షాక్‌లో పసిడి ప్రేమికులు!
Gold Rate Today: దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎప్పటికీ లేనంత గరిష్టానికి చేరాయి. పసిడి ప్రేమికులకు భారీ షాక్ ఇస్తూ, ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మంగళవారం ఒక్కరోజులోనే బంగారం ధరలు గణనీయంగా పెరిగి, ఒక తులం (10 గ్రాములు) స్వచ్ఛమైన బంగారం రూ.1,10,000 మార్క్‌ను దాటింది. అదే సమయంలో వెండి ధరలు కూడా పెరుగుతూ కొనుగోలుదారులను కంగారు పెట్టాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులానికి రూ.1,360 పెరిగి రూ.1,10,290కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులానికి రూ.1,250 పెరిగి రూ.1,01,100 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధరలు విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా కొనసాగుతున్నాయి.
బంగారం లాగే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ఒక్కరోజే రూ.3,000 పెరిగి రూ.1,40,000 వద్దకు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.1,10,440, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,250 వద్ద ఉంది. అయితే ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,30,000గా నమోదైంది.
ఒకేరోజులో ఇంతటి పెరుగుదల రావడంతో, బంగారం కొనుగోలు చేయాలనుకునే సాధారణ మరియు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.