Gold Prices: రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. తులం బంగారంపై రూ.1,000 పెరిగిన ధర

Gold Prices: తులం బంగారంపై రూ.1,000 పెరిగిన ధర.. రూ.90,000 పలుకుతున్న కిలో వెండి ధర

Update: 2024-04-12 06:23 GMT

Gold Prices: రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. తులం బంగారంపై రూ.1,000 పెరిగిన ధర

Gold Prices: బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతు కొనుగోలుదారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మార్చి నెల మొత్తం అంతంత మాత్రంగా పెరిగిన పసిడి రేట్లు.. ఏప్రిల్ మొదటి వారానికి ఏకంగా 70 వేలకు చేరుకుని అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. దీంతో పసిడి ప్రియులు బంగారం పేరు వింటేనే భయపడిపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్ వేళ.. బంగారం ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.

బంగారం ధర వరుసగా ఐదో రోజు పెరిగింది. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఇవాళ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. తులం బంగారం పై 1000 రూపాయలకు పైగా పెరగగ్గా, కిలో వెండి పై 150రూపాయలకు పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 67వేల 200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 73వేల310 రూపాయలుగా ఉంది. వెండి కిలో 90వేల రూపాయలు పలుకుంతోంది.

పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

Tags:    

Similar News