Gold Price Today: పెరిగిన గోల్డ్, వెండి ధరలు.. ఈరోజు తులం రేటు ఎంతంటే?
Gold Price Today: బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. గత రెండు మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు, ఈరోజు మాత్రం మళ్లీ పెరిగాయి.
Gold Price Today: పెరిగిన గోల్డ్, వెండి ధరలు.. ఈరోజు తులం రేటు ఎంతంటే?
Gold Price Today: బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. గత రెండు మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు, ఈరోజు మాత్రం మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే, తులం బంగారం ధర వెయ్యి రూపాయల పైనే పెరిగింది.
భారతీయ సంస్కృతిలో బంగారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ధరలు పెరిగినా, తగ్గినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. జూన్ 12న దేశంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: ₹98,410
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: ₹90,210
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
ఢిల్లీ: 24 క్యారెట్ల (10 గ్రాములు) - ₹98,560, 22 క్యారెట్ల (10 గ్రాములు) - ₹90,360
ముంబై: 24 క్యారెట్ల (10 గ్రాములు) - ₹98,410, 22 క్యారెట్ల (10 గ్రాములు) - ₹90,210
హైదరాబాద్: 24 క్యారెట్ల (10 గ్రాములు) - ₹98,410, 22 క్యారెట్ల (10 గ్రాములు) - ₹90,210
విజయవాడ: 24 క్యారెట్ల (10 గ్రాములు) - ₹98,410, 22 క్యారెట్ల (10 గ్రాములు) - ₹90,210
బెంగళూరు: 24 క్యారెట్ల (10 గ్రాములు) - ₹98,410, 22 క్యారెట్ల (10 గ్రాములు) - ₹90,210
చెన్నై: 24 క్యారెట్ల (10 గ్రాములు) - ₹98,410, 22 క్యారెట్ల (10 గ్రాములు) - ₹90,210
వెండి ధరలు
వెండి ధర కొద్దిగా తగ్గింది. కిలో వెండిపై దాదాపు వంద రూపాయలు తగ్గడంతో, ప్రస్తుతం కిలో వెండి ధర ₹1,08,900 ఉంది.
బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి అంతర్జాతీయ సంస్థలు హాల్‌మార్క్ ఇస్తాయి. ఆభరణాలపై ఇలా రాసి ఉంటుంది:
24 క్యారెట్లు: 999
23 క్యారెట్లు: 958
22 క్యారెట్లు: 916
21 క్యారెట్లు: 875
18 క్యారెట్లు: 750
చాలామంది 22 క్యారెట్ల బంగారాన్ని కొంటారు, కొందరు మాత్రం 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ సంఖ్య పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత పెరుగుతుంది.