Portable Dryer: వర్షంలో తడిసిన బట్టలతో చిరాకుగా ఉందా.. ఈ పోర్టబుల్ డ్రైయర్‌‌తో కేవలం 15 నిమిషాల్లోనే ఆరబెట్టేయోచ్చు.. ధర ఎంతంటే?

Portable Dryer: వాషింగ్ మెషీన్ డ్రైయర్ ఉపయోగించినా.. బట్టలు ఒక్కోసారి ఆరవు. ఇలాంటి బాధల నుంచి బయటపడేందుకు పోర్టబుల్ డ్రైయర్ ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. ఇది తడి దుస్తులను 15 నిమిషాల్లోనే ఆరబెట్టేస్తుంది.

Update: 2023-07-08 06:30 GMT

Portable Dryer: వర్షంలో తడిసిన బట్టలతో చిరాకుగా ఉందా.. ఈ పోర్టబుల్ డ్రైయర్‌‌తో కేవలం 15 నిమిషాల్లోనే ఆరబెట్టేయోచ్చు.. ధర ఎంతంటే?

Portable Dryer: వర్షాకాలం వచ్చింది. తెలుగు రాష్ట్రాలతోపాటు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల సమయంలో అకస్మాత్తుగా కురిసే వర్షానికి బట్టలు తడిసిపోవడం ఖాయం. అటువంటి పరిస్థితిలో బట్టలు తడిగా ఉండడంతోపాటు సరిగ్గా ఆరవు. దీంతో ముతక వాసన వస్తుంటాయి. దుస్తులను ఆరబెట్టడానికి చాలా సమయం పడుతుంది. వాషింగ్ మెషీన్ డ్రైయర్ ఉపయోగించినా.. బట్టలు ఒక్కోసారి ఆరవు. ఇలాంటి బాధల నుంచి బయటపడేందుకు పోర్టబుల్ డ్రైయర్ ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. ఇది తడి దుస్తులను 15 నిమిషాల్లోనే ఆరబెట్టేస్తుంది.

కౌంటర్‌టాప్ డ్రైయర్..

మోరస్ జీరో అనే ఈ పోర్టబుల్ 'వాక్యూమ్ + డీహైడ్రేషన్ టెక్నాలజీతో కూడిన ప్రపంచంలోనే మొట్టమొదటి కౌంటర్‌టాప్ టంబుల్ డ్రైయర్' అని పేర్కొంది. మరో మాటలో చెప్పాలంటే, ఇది చాలా వేగంగా బట్టలు ఆరబెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే 15 నిమిషాల్లో బట్టలు శుభ్రం అవుతాయి. అలాగే ఇది ఈ ప్రక్రియలో 40 శాతం వరకు శక్తిని ఆదా చేస్తుంది.

నీరు త్వరగా ఆరిపోతుంది..

మినీ డ్రైయర్ వేడిని, లోపల తగ్గిన గాలి పీడనాన్ని మిళితం చేయడం వల్ల నీరు త్వరగా ఆరిపోయేలా చేస్తుంది.

మోరస్ జీరో ఇప్పటికే కిక్‌స్టార్టర్‌లో దాని లక్ష్యాన్ని 10 రెట్లు పెంచింది. ఈ యూనిట్ $299 (దాదాపు రూ. 25,000) నుంచి ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం రివ్యూలు చదివి, పూర్తి వివరాలు తెలుసుకున్నాకే సరైన నిర్ణయం తీసుకోవాలి.

Tags:    

Similar News