Gas Cylinder: ఎల్‌పీజీ సిలిండర్‌పై ఇలాంటి నంబర్లు చెక్ చేశారా.. తెలుసుకోకుంటే, భారీ ప్రమాదంలో పడ్డట్లే..!
LPG Cylinder Price: చాలా మంది LPG సిలిండర్ బరువు, లీకేజీని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటారు. అయితే ప్రత్యేక రకం కోడ్‌ను కూడా తనిఖీ చేయడం ద్వారా సిలిండర్‌ను చెక్ చేసుకోవచ్చు.
Gas Cylinder: ఎల్‌పీజీ సిలిండర్‌పై ఇలాంటి నంబర్లు చెక్ చేశారా.. తెలుసుకోకుంటే, భారీ ప్రమాదంలో పడ్డట్లే..!
LPG Cylinder Number Meaning: LPG ప్రతి ఇంట్లో తప్పని సరిగా ఉంటుంది. LPG సిలిండర్లను చాలా ఇళ్లలో వంట చేయడానికి ఉపయోగిస్తారు. సిలిండర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది LPG సిలిండర్ బరువు, లీకేజీని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటారు. అయితే ప్రత్యేక రకం కోడ్‌ను కూడా తనిఖీ చేయడం ద్వారా సిలిండర్‌ను చెక్ చేసుకోవచ్చు.
ప్రత్యేక కోడ్ ఏంటి?
గ్యాస్ సిలిండర్ పైభాగంలో ప్రత్యేక కోడ్ రాసి ఉంటుంది. ఈ కోడ్ అక్షరాలు, సంఖ్యల రూపంలో నమోదు చేయబడుతుంది. ఈ కోడ్ సిలిండర్ గడువు తేదీ గురించి చెబుతుంది. సిలిండర్‌పై రాసిన A, B, C, D అంటే సంవత్సరంలో 12 నెలలు, అయితే ఈ సిలిండర్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుందో సంఖ్య చెబుతుంది.
త్రైమాసిక ప్రాతిపదికన పంపిణీ..
సంవత్సరంలో 12 నెలలు నాలుగు భాగాలుగా విభజించబడ్డాయి. A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి. B అంటే ఏప్రిల్, మే, జూన్. సి అంటే జులై, ఆగస్టు, సెప్టెంబర్. అలాగే, D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఉదాహరణ నుంచి అర్థం చేసుకుందాం.. ఒక సిలిండర్‌లో A 22 అని రాసినట్లయితే, ఈ సిలిండర్ గడువు జనవరి, ఫిబ్రవరి లేదా మార్చిలో ముగుస్తుందని అర్థం. 22 అంటే 2022 సంవత్సరంలో గడువు ముగుస్తుంది. మరోవైపు, B 23 అని రాస్తే, మీ సిలిండర్ గడువు ఏప్రిల్, మే, జూన్‌లలో ముగుస్తుందని అర్థం. 23 అంటే 2023లో గడువు ముగుస్తుందని అర్థం.
సిలిండర్ పేలవచ్చు..
మీరు గడువు తేదీ తర్వాత కూడా సిలిండర్‌ని ఉపయోగిస్తుంటే, అది మీకు ప్రమాదకరం. అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం కూడా ఉండవచ్చు. ఈ సందర్భంలో, ఈ కోడ్ తనిఖీ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు, మీరు సిలిండర్ బరువును కూడా తనిఖీ చేసుకోవాలి.