Bank of Baroda: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా FD వడ్డీ రేట్లలో మార్పు.. సీనియర్‌ సిటిజన్లకి మరింత ఆదాయం..!

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లలో మార్పు చేసింది.

Update: 2023-03-20 10:47 GMT

Bank of Baroda: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా FD వడ్డీ రేట్లలో మార్పు.. సీనియర్‌ సిటిజన్లకి మరింత ఆదాయం..!

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లలో మార్పు చేసింది. దాదాపు రూ.2 డిపాజిట్ల వరకు మార్పు చేసింది. సాధారణ ప్రజలకు FD వడ్డీ రేటు 7.05 శాతం ఉంటుంది. సీనియర్ సిటిజన్లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో FDలో 7.55 శాతం వరకు సంపాదించవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన రేట్లు మార్చి 17 నుంచి అమల్లోకి వచ్చాయి. మే 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు ఆర్బీఐ రెపో రేటును 2.50 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ఏప్రిల్‌లో మరోసారి 0.25 శాతం పెంచవచ్చని అంచనా. కొత్త వడ్డీరేట్లు తెలుసుకుందాం.

బ్యాంక్ ఆఫ్ బరోడా fd రేట్లు

1.పెట్టుబడిదారులు ఏడు రోజుల నుంచి 45 రోజుల FDలపై 3 శాతం వడ్డీని పొందుతారు.

2. 46 రోజుల నుంచి 180 రోజుల FDలపై 4.5 శాతం వడ్డీ లభిస్తుంది.

3. 181 రోజుల నుంచి 210 రోజుల మధ్య FDలపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది.

4. 211 రోజులు లేదా ఒక సంవత్సరం కంటే తక్కువ FDలపై 5.75 శాతం వడ్డీ లభిస్తుంది.

5. ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఎఫ్‌డీలపై 6.75 శాతం వడ్డీ లభిస్తుంది.

6. మూడేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఎఫ్‌డీలపై 6.5 శాతం వడ్డీ లభిస్తుంది.

7. 444 రోజుల ప్రత్యేక FDపై 6.75 శాతం వడ్డీ లభిస్తుంది.

8. 555 రోజుల ప్రత్యేక FDపై 6.75 శాతం వడ్డీ లభిస్తుంది.

9. 399 రోజుల ప్రత్యేక FDపై 7.05 శాతం వడ్డీ లభిస్తుంది.

సీనియర్ సిటిజన్లకి వడ్డీ

1. ఏడు రోజుల నుంచి 45 రోజుల FDలపై 3.5 శాతం వడ్డీని పొందుతారు.

2. 46 రోజుల నుంచి 180 రోజుల FDలపై 5% వడ్డీ లభిస్తుంది.

3. 181 రోజుల నుంచి 210 రోజుల మధ్య FDపై 5.75 శాతం వడ్డీ పొందుతారు.

4. 211 రోజులు లేదా ఒక సంవత్సరం కంటే తక్కువ FDలపై 6.25 శాతం వడ్డీ లభిస్తుంది.

5. ఎఫ్‌డీలపై ఏడాది నుంచి మూడేళ్ల వరకు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది.

6. మూడేళ్ల నుంచి 5 ఏళ్ల వరకు ఎఫ్‌డీలపై 7.15 శాతం వడ్డీ లభిస్తుంది.

7. మూడేళ్ల నుంచి 5 ఏళ్ల వరకు ఎఫ్‌డీలపై 7.15 శాతం వడ్డీ లభిస్తుంది.

8. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు FDలపై 7.50 శాతం వడ్డీ లభిస్తుంది.

9. 444 రోజుల ప్రత్యేక FDపై 7.25 శాతం వడ్డీ లభిస్తుంది.

10.555 రోజుల ప్రత్యేక FDపై 7.25 శాతం వడ్డీ లభిస్తుంది.

11. 399 రోజుల ప్రత్యేక FDపై 7.55 శాతం వడ్డీ లభిస్తుంది.

Tags:    

Similar News