Stock Market: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో, రేట్ సెన్సిటివ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో, రేట్ సెన్సిటివ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల తీసివేతకు మొగ్గు చూపారు.
ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 166 పాయింట్లు నష్టపోయి 80,543 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 75 పాయింట్లు పడిపోయి 24,574 వద్ద స్థిరపడింది. విదేశీ మారక ద్రవ్యలతో పోలిస్తే రూపాయి మారకం విలువ అమెరికా డాలరుతో రూ. 87.73గా నమోదైంది.
స్టాక్ మార్కెట్ వివరాల్లోకి వెళితే, సెన్సెక్స్‌లోని ప్రముఖ కంపెనీలైన సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే అదానీ పోర్ట్స్, బీఈఈఎల్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
ప్రముఖ ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఆర్బీఐ నిర్ణయం తర్వాత పెట్టుబడిదారుల మానసికతలో కొంత అనిశ్చితి కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిళ్లతోపాటు దేశీయంగా వస్తున్న డేటా కూడా మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.