EPFO: ఉద్యోగులకి చేదువార్త.. 40 సంవత్సరాల కనిష్టానికి వడ్డీరేట్లు..

EPFO: ఉద్యోగస్తులకు ఇది చేదు వార్తనే చెప్పాలి. చాలా కాలంగా ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేట్లు పెరుగుతాయని ఆశిస్తున్న ప్రజలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2022-03-12 15:45 GMT

EPFO: ఉద్యోగులకి చేదువార్త.. 40 సంవత్సరాల కనిష్టానికి వడ్డీరేట్లు..

EPFO: ఉద్యోగస్తులకు ఇది చేదు వార్తనే చెప్పాలి. చాలా కాలంగా ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేట్లు పెరుగుతాయని ఆశిస్తున్న ప్రజలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పండుగకు ముందు EPFO వడ్డీ రేట్లని పెంచడానికి బదులుగా తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ రేటును ప్రకటించారు, ఇది 2020-21లో 8.5 శాతంగా ఉంది. దీంతో ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈపీఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీ రేటు ఇవ్వడం 1977-78 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు పీఎఫ్‌పై 8 శాతం వడ్డీ ఇచ్చారు.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పీఎఫ్ ఖాతాదారులకు 0.40 శాతం వడ్డీ తగ్గనుంది. 2018-19, 2016-17లో 8.65 శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-2014, 2014-15లో 8.75 శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8 శాతం చొప్పున వడ్డీని జమ చేశారు. అయితే కోవిడ్ సంక్షోభ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించారు. 8.5శాతం వడ్డీని చందాదారులకు ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని కొనసాగించిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి గౌహతిలో EPFO సమావేశం జరుగుతోంది. మీడియా సమాచారం ప్రకారం.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) తన సమావేశంలో EPF పై 8.1 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం తర్వాత సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు. తరువాత ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా స్టాంప్ చేయబడి అఫీషియల్‌గా వడ్డీరేటుని ప్రకటిస్తారు. 

Tags:    

Similar News