Indian Railway: రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. కారణం లేకుండా చైన్‌ లాగితే జైలుకే..!

Indian Railway: రైళ్లో వెళ్లేటప్పుడు ప్రయాణికులు కొన్ని విషయాలని కచ్చితంగా తెలుసుకోవాలి.

Update: 2022-12-23 12:09 GMT

Indian Railway: రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. కారణం లేకుండా చైన్‌ లాగితే జైలుకే..!

Indian Railway: రైళ్లో వెళ్లేటప్పుడు ప్రయాణికులు కొన్ని విషయాలని కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే జరిమానాతో పాటు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. రైలులో ఎమర్జెన్సీ చైన్‌ ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. దీని నియమాలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఎమర్జెన్సీ చైన్‌ అత్యవసర పరిస్థితుల్లో రైలును ఆపడానికి పనిచేస్తాయి. కానీ కొన్నిసార్లు ప్రజలు దానిని దుర్వినియోగం చేస్తారు. ఎటువంటి కారణం లేదా ఎమర్జెన్సీ చైన్ లాగిన సందర్భాలు చాలాసార్లు కనిపించాయి.

రైల్వే నిబంధనల ప్రకారం సరైన కారణం లేకుండా ఎమర్జెన్సీ చైన్ లాగితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఎమర్జెన్సీ అలారం చైన్‌ను లాగడం వల్ల రైలు ఆలస్యంగా నడుస్తుంది. దీంతో పాటు ఆ ట్రాక్‌లో వెనుక నుంచి వచ్చే ఇతర రైళ్ల షెడ్యూల్ మారుతుంది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 141 ప్రకారం ఎటువంటి కారణం లేకుండా చైన్‌ను లాగినందుకు రూ.1000 జరిమానాతో పాటు 1 సంవత్సరం వరకు జైలు శిక్ష విధిస్తారు.

ఈ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ చైన్‌ లాగవచ్చు.

1. కదులుతున్న రైలులో మంటలు చెలరేగితే ఎమర్జెన్సీ చైన్‌ లాగవచ్చు.

2. మీతో పాటు వృద్ధులు లేదా వికలాంగులు ఉన్నట్లయితే వారు రైలు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే ఆ సందర్భంలో రైలు కదలడం ప్రారంభిస్తే చైన్ లాగవచ్చు.

3. ఒక పిల్లవాడిని స్టేషన్‌లో ఉండి రైలు కదలడం ప్రారంభిస్తే ఎమర్జెన్సీ చైన్‌ని ఉపయోగించవచ్చు.

4. ప్రయాణంలో ప్రయాణీకుల ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తే గొలుసును లాగవచ్చు.

5. ప్రయాణంలో దొంగతనాలు, దోపిడీలు జరిగితే చైన్ పుల్లింగ్ చేయవచ్చు.

Tags:    

Similar News