Alert: అలర్ట్‌.. జూలై 31లోపు ఈ పనులు చేయకపోతే పెద్ద నష్టం..!

Alert: వినియోగదారులకి అలర్ట్‌.. జూలై 31దగ్గరపడింది. ఈ పరిస్థితిలో మీరు పరిష్కరించుకోవాల్సిన అనేక పనులు ఉన్నాయి.

Update: 2022-07-30 08:03 GMT

Alert: అలర్ట్‌.. జూలై 31లోపు ఈ పనులు చేయకపోతే పెద్ద నష్టం..!

Alert: వినియోగదారులకి అలర్ట్‌.. జూలై 31దగ్గరపడింది. ఈ పరిస్థితిలో మీరు పరిష్కరించుకోవాల్సిన అనేక పనులు ఉన్నాయి. ఇందులో పిఎం కిసాన్ యోజన ఈ-కెవైసి చేయడం, సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడం, గ్యాస్ సిలిండర్ బుకింగ్, అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్‌లను గ్యాస్ కనెక్షన్ కార్డ్‌తో లింక్ చేసుకోవడం, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం వంటివి ఉన్నాయి. వాస్తవానికి ఆగస్టు 1 నుంచి కొన్ని నియమాలు మారుతున్నాయి.

1. ప్రభుత్వం విడుదల చేసిన డెడ్‌లైన్ ప్రకార ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీ జూలై 31. మీరు ఈ రోజులోపు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకపోతే జరిమానాతో దానిని ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసే వ్యక్తులు జరిమానాగా రూ.5,000 చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.

2. మీరు చౌకగా సిలిండర్ తీసుకోవాలనుకుంటే ముందుగానే బుక్ చేసుకోండి. వాస్తవానికి సిలిండర్ల ధరలు ప్రతి నెలా ఒకటో తేదీన మారుతూ ఉంటాయి. ఆగస్టు 1న ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ల రేట్లను నిర్ణయిస్తాయి. ఈసారి కంపెనీలు రేటు పెంచే అవకాశాలు ఉన్నాయి.

3. మీరు పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులైతే జూలై 31లోపు KYCని పూర్తి చేయండి. దీని చివరి తేదీ జూలై 31 అని గుర్తుంచుకోండి. ఈ-కేవైసీ చేయలేని రైతులు 12వ విడత నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.

4. మీరు సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జూలై 31 వరకు సబ్సిడీ అందిస్తున్నాయి. ద్విచక్ర వాహనంపై రూ.30 వేలు, త్రీవీలర్‌పై రూ.60 వేలు, నాలుగు చక్రాల వాహనంపై రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

Tags:    

Similar News