Payal Rajput with Kama Haasan: కమల్ తో ఛాన్స్ కొట్టేసిన పాయల్!

Payal Rajput with Kama Haasan: చేసిన కొద్ది సినిమాలతోనే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..

Update: 2020-07-04 09:43 GMT
Payal Rajput (file Photo)

Payal Rajput with Kama Haasan: చేసిన కొద్ది సినిమాలతోనే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. మొదటి సినిమా RX 100 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన పాయల్ తాజాగా వెంకీ మామ, డిస్కో రాజా సినిమాలతో ఆకట్టుకుంది. ఇప్పుడీ భామకి ఏకంగా స్టార్ హీరో కమల్ హసన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అయితే అది హీరోయిన్ గా మాత్రం కాదు లెండి. కమల్ హిట్ మూవీ భారతీయుడు సినిమాకు సీక్వల్‌గా రాబోతున్న 'భారతీయుడు 2' చిత్రంలో పాయల్ చేత అదిరిపోయే ఐటెం సాంగ్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.. ఆ ఐటెం సాంగ్ కోసం పాయల్ నిఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే ఇందుకోసం ఆమె ఎక్కువ రెమ్మ్యూనరేషన్ తీసుకుంటుదని తెలుస్తోంది. దీనిపైన పైన త్వరలో అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఇప్పటికే పాయల్.. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'సీత' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది.

ఇక ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ప్రస్తుతానికి వాయిదా పడిన ఈ సినిమాని త్వరలో మళ్ళీ పట్టాలేక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారతీయుడు సినిమా తర్వాత కమల్ , శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని లైకా సినిమా సంస్థ భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తుంది. 


Tags:    

Similar News