S.Rayavaram: లాక్ డౌన్ నేపద్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్దిక సాయం ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రజలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఎవరూ అధైర్య పడవద్దని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు.

Update: 2020-04-04 05:34 GMT
MLA Golla Baburao

ఎస్.రాయవరం: ప్రజలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఎవరూ అధైర్య పడవద్దని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. లాక్ డౌన్ నేపద్యంలో ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయల ఆర్దిక సహాయంను తిమ్మాపురంలో ఎమ్మెల్యే శనివారం ఉదయం ఇంటింటికీ వెళ్ళి పంపిణీ చేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ ప్రభుత్వ చౌకదుకాణాల ద్వారా కుటుంబంలోని ఒక్కో సభ్యుడికీ 5 కేజీల బియ్యాన్ని, కేజీ కందిపప్పు పంపిణీ జరుగుతున్నదని అన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటన మేరకు వెయ్యి రూపాయల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందని తెలిపారు. లాక్ డౌన్ లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనీ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ప్రజలంతా ఇళ్ళలొనే ఉండాలని, సామాజిక దూరం పాటిస్తూ కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొలిశెట్టి గోవిందు, కొణతాల శ్రీనివాస్, మధువర్మ, బొండా దివాణం, మందగుదుల రమణ, సత్తిబాబు, హరి, మూలయ్య, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.


Tags:    

Similar News