Tollywood: మధురం ప్రతీ ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే అందమైన ప్రేమ కథ: హీరో ఉదయ్ రాజ్

Tollywood: పలు క్రేజీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఉదయ్ రాజ్ ‘మధురం’సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు.

Update: 2025-04-17 12:30 GMT

Tollywood: మధురం ప్రతీ ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే అందమైన ప్రేమ కథ: హీరో ఉదయ్ రాజ్

Tollywood: పలు క్రేజీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఉదయ్ రాజ్ ‘మధురం’సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రాజేష్ చికిలే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైష్ణవి సింగ్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం. బంగార్రాజు నిర్మించిన ఈ సినిమా, ‘‘A Memorable Love’’ ట్యాగ్ లైన్‌తో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 18వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో ఉదయ్‌ రాజ్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఉదయ్‌ రాజ్‌ మాట్లాడుతూ..'చిరంజీవి గారినే ఆదర్శంగా తీసుకొని సినిమాల్లోకి వచ్చాను. ‘ఆచార్య’ చిత్ర సమయంలో ఆయనతో మాట్లాడటం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో సహాయకుడిగా, బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టుగా పనిచేశాను. బంగార్రాజు గారి ప్రోత్సాహంతో ఈ సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది' అని చెప్పుకొచ్చారు.

‘మధురం’ కథ నైంటీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. పదవ తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ చాలా హృద్యంగా ఉంటుంది. ఇందులో మూడు వేరియేషన్లలో నటించాను – చిన్న వయసు బాలుడు, స్కూల్ స్టూడెంట్, మిడిల్ ఏజ్ వ్యక్తిగా. గెటప్‌లకు తగ్గట్టుగా బాడీలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. డైరెక్టర్ రాజేష్ చికిలేతో నాకు చిరకాల పరిచయం ఉంది. ఇద్దరం జెడ్‌పీహెచ్‌ఎస్‌లో చదివినవాళ్లం కావడంతో అప్పటి స్కూల్ లైఫ్‌ను రీఫ్లెక్ట్ చేసేలా కథను రూపొందించాం. అప్పటి స్కూల్ సీన్స్, సైకిల్ పై ప్రేమకు సంబంధించిన చిన్న చిన్న మోమెంట్స్, గ్రామీణ నేటివిటీ – ఇవన్నీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి' అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ..'తెలుగు హీరోయిన్ తీసుకోవాలనుకున్నా, సాధ్యం కాలేదు. కానీ వైష్ణవి సింగ్ బాగా నటించింది. మధు-రామ్‌ల ప్రేమకథే ఈ సినిమా కథ. సంగీతాన్ని వెంకీ వీణ అందించారు. టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. నిర్మాతగారే స్వయంగా సినిమా రిలీజ్ చేస్తున్నారు' అని చెప్పుకొచ్చారు. మరి మంచి అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News