Delhi Assembly Election Results 2025: అప్పట్లో కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయం-నేడు ఉనికి కోసం పోరాటం
2003లో కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ దిల్లీ పీఠాన్ని దక్కించుకుంది.
Delhi Assembly Election Results 2025: అప్పట్లో కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయం-నేడు ఉనికి కోసం పోరాటం
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతాను తెరవలేదు. మూడుసార్లు వరుసగా దిల్లీ పీఠం దక్కించుకున్న హస్తం పార్టీ ఇప్పుడు ఉనికి కోసం అష్టకష్టాలు పడుతోంది.దిల్లీ రాష్ట్రంలో చక్రం తిప్పిన హస్తం పార్టీ వైపు హస్తిన ఓటర్లు మొగ్గు చూపడం లేదు.
దిల్లీలో మూడుసార్లు కాంగ్రెస్ వరుస విజయాలు
1998లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె బీజేపీ బీజేపీ అభ్యర్ధి లాల్ తివారీ చేతిలో ఓడిపోయారు. 2003లో కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ దిల్లీ పీఠాన్ని దక్కించుకుంది.
2008 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 1998, 2003 ఎన్నికల్లో గోలే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2008 ఎన్నికల్లో దీక్షిత్ దిల్లీ అసెంబ్లీ స్థానానికి మారారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. దిల్లీ అసెంబ్లీ స్థానంలో షీలా దీక్షిత్ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు. 2013 డిసెంబర్ 8న షీలా దీక్షిత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
2008లో కాంగ్రెస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 40.31 శాతం.2013లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు 24.55శాతానికి పడిపోయాయి.2015లో ఇవి 10 శాతానికి పడిపోయాయి.2020లో కాంగ్రెస్ పార్టీ 4.26% ఓట్ల వాటాను సాధించాయి. 2025 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 శాతం ఓట్లను సాధించింది.
కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని దిల్లీలో ఆప్ ఆక్రమించింది. దిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా వెళ్తూ బీజేపీ తన పట్టను పెంచుకొంది. ఆప్ మాత్రం పట్టును కోల్పోయింది. కాంగ్రెస్ ఓట్ల చీలిక పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరించిందనే విశ్లేషణలున్నాయి.