Volvo XC90: స్టైలిష్ లుక్‌తో వోల్వో XC90.. కారు కొనాలంటే కోటి కొట్టాల్సిందే..!
Volvo XC90: ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి.
Volvo XC90: స్టైలిష్ లుక్‌తో వోల్వో XC90.. కారు కొనాలంటే కోటి కొట్టాల్సిందే..!
Volvo XC90: ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. దీని డిజైన్‌ని మీరు ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. దీని ప్రస్తుత మోడల్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ను తీసుకువచ్చింది. ఇందులో కొన్ని కొత్త అప్‌డేట్ ఫీచర్లు చేర్చారు. ఇది కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ కారు ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
గతేడాది ఈ కారు ప్రపంచ స్థాయిలో విడుదలైంది. ఈ కారు చాలా కాలం తర్వాత 6, 7 సీట్ల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది, దీని ఫేస్‌లిఫ్ట్ మోడల్ మార్కెట్లోకి వచ్చింది. కొత్త వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్ ముందు, వెనుక లుక్‌లో మార్పులు కనిపిస్తాయి. దీని ముందు భాగంలో స్లాట్స్ గ్రిల్ అందుబాటులో ఉంటుంది. థోర్ హామర్ లుక్‌తో ముందు భాగంలో ఎల్ఈడీ డిఆర్ఎల్ ఉన్నాయి.
ఇది కాకుండా, మరిన్ని ఎయిర్ వెంట్‌ల కోసం ముందు బంపర్ భారీ మార్పులు చేశారు. ఈ కారులో కొత్త అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్లు కూడా ఇందులో కనిపిస్తాయి. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే 11.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, క్యాబిన్ మునుపటి వెర్షన్ మాదిరిగానే ఉంది.
2025 వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్‌లో 48V మైల్డ్ హైబ్రిడ్ 2.0 లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 250బిహెచ్‌పి పవర్, 360ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్ నేరుగా Audi Q7, BMWతో పోటీపడుతుంది. కారు ధర రూ. 1.02 కోట్లు ఎక్స్‌షోరూమ్.