Volkswagen Virtus Discount: ఇవి కదా ఆఫర్లంటే.. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌పై రూ. 1.70 లక్షల డిస్కౌంట్..!
Volkswagen Virtus Discount: కార్లపై మరోసారి డిస్కౌంట్లు మొదలయ్యాయి.
Volkswagen Virtus Discount: కార్లపై మరోసారి డిస్కౌంట్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీతో పోటీ పడుతున్న ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌పై ధరలు తగ్గాయి.
ఈ నెలలో వర్టస్‌పై రూ.1.70 లక్షల తగ్గింపు ఇస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఒక విలాసవంతమైన సెడాన్ కారు, కారులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. ఈ నెలలో వర్టస్ కార్లపై బంపర్ డిస్కౌంట్లను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవచ్చు. MY2024 మోడల్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌పై రూ. 1.50 లక్షల నుండి రూ. 1.70 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తుంది. ఈ వెహికల్ పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఈ ఆఫర్లను ప్రకటించింది. అంతేకాకుండా కస్టమర్‌లు MY 2024 వోక్స్‌వ్యాగన్ వర్టస్‌లో రూ. 80,000 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది. డిస్కౌంట్ తో పాటు ఇతర వివరాల కోసం కస్టమర్‌లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.
వోక్స్‌వ్యాగన్ వర్టస్ ధర రూ.11.56 లక్షల నుంచి రూ.19.41 లక్షల వరకు ఉంటుంది. ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో మొదటిది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఈ ఇంజన్ 115పిఎస్ పవర్, 178ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. రెండోది 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ . ఈ ఇంజన్ 150పిఎస్ పవర్, 250ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ కారులో 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 7-స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్ ఉంటుంది.