2025 Vespa Lineup: వెస్పా కొత్త స్కూటర్లు.. ఫీచర్లు చూస్తే ఫిదా..!

2025 Vespa Lineup: కొత్త స్కూటర్లు వెస్పా, వెస్పా-ఎస్ 125సీసీ, 150సీసీ ఇంజన్ ఆప్షన్‌లతో విడుదలయ్యాయి. ఈ రెండు ఇంజన్లు పవర్‌తో పాటు మంచి పనితీరును అందిస్తాయి.

Update: 2025-02-12 06:41 GMT

2025 Vespa Lineup: వెస్పా కొత్త స్కూటర్లు.. ఫీచర్లు చూస్తే ఫిదా..!

2025 Vespa Lineup:

దేశంలో మరోసారి వెస్పా తన కొత్త స్కూటర్ల లైనప్ రేజ్‌ని అప్‌డేట్ చేసింది. రెండు స్కూటర్లను రీ డిజైన్ చేసి విడుదల చేసింది. విశేషమేమిటంటే 2025 వెస్పా లైనప్‌లో కొత్త టెక్నాలజీ కనిపించనుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ స్పెషల్ ఎడిషన్లపై కంపెనీ ప్రత్యేత శ్రద్ధ చూపింది. 2025 వెస్పా లైనప్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.32 లక్షల నుండి రూ. 1.96 లక్షల వరకు ఉంటుంది.

కొత్త స్కూటర్లు వెస్పా, వెస్పా-ఎస్ 125సీసీ, 150సీసీ ఇంజన్ ఆప్షన్‌లతో విడుదలయ్యాయి. ఈ రెండు ఇంజన్లు పవర్‌తో పాటు మంచి పనితీరును అందిస్తాయి. ఇందులోని 125సీసీ ఇంజన్ 9.5హెచ్‌పి పవర్, 10.1ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలానే 150సీసీ ఇంజన్ 11.4హెచ్‌పి పవర్, 11.66ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది.

వీటిలో చాలా కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వెస్పా స్కూటర్‌లో వెర్డే అమాబైల్, రోసో రెడ్, పెరల్ వైట్, నీరో బ్లాక్, అజురో ప్రోవెంజా, బ్లూ అండ్ పెర్ల్ వైట్, ఆరెంజ్,పెరల్ వైట్ కలర్ ప్యాలెట్ ఉన్నాయి. వెస్పా ఎస్ గోల్డ్ కలర్‌తో కొత్త ఓరో స్పెషల్ ఎడిషన్‌ను కూడా ఉంది. వెస్పా ఎస్ పాలెట్‌లోని ఇతర కలర్స్‌తో ఓరో, పెర్ల్ వైట్, నీరో బ్లాక్ (మాట్), వెర్డే అంబిజియోసో (మాట్టే), గియాల్లో ఎల్లో (మాట్), అరన్సియో ఇంపల్సివో, రెడ్ అండ్ పెర్ల్ వైట్, బ్లాక్ ,పెర్ల్ వైట్ ఉన్నాయి.

ఈ స్కూటర్లలో సరికొత్త టెక్నాలజీని అందిస్తుంది. కీలెస్ ఇగ్నిషన్ , కొత్త TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్‌ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ విషయానికి వస్తే ఈ వెస్పా స్కూటర్లు క్లాసిక్ స్టైల్‌లో ఉన్నాయి. యువతతో పాటు కుటుంబ వర్గాన్ని కూడా టార్గెట్ చేస్తున్నాయి.

Tags:    

Similar News