Upcoming Compact SUV: ఇండియాలో లాంచ్‌కు రెడీ.. త్వరలో రాబోతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..!

Upcoming Compact SUV: 2025 సంవత్సరం కొత్త కార్లకు చాలా ప్రత్యేకమైనది. మారుతి నుండి మహీంద్రా వరకు తమ కొత్త వాహనాలను ఈ సంవత్సరం విడుదల చేయబోతున్నాయి.

Update: 2025-02-14 12:15 GMT

Upcoming Compact SUV: ఇండియాలో లాంచ్‌కు రెడీ.. త్వరలో రాబోతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..!

Upcoming Compact SUV: 2025 సంవత్సరం కొత్త కార్లకు చాలా ప్రత్యేకమైనది. మారుతి నుండి మహీంద్రా వరకు తమ కొత్త వాహనాలను ఈ సంవత్సరం విడుదల చేయబోతున్నాయి. భారత్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఏడాది విడుదల కానున్న ఆ వాహనాల గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్

ఈ సంవత్సరం మారుతి సుజుకి తన ఫేమస్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకువస్తోంది. ఈసారి ఈ ఎస్‌యూవీలో హైబ్రిడ్ టెక్నాలజీ కూడా కనిపించనుంది. కొత్త ఫ్రాంక్స్ Z సిరీస్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ ప్రస్తుతం కంపెనీ స్విఫ్ట్, డిజైర్‌లో ఉంది. కొత్త హైబ్రిడ్ మైలేజ్ లీటరుకు 30కిలోమీటర్లకు మించి ఉంటుందని చెబుతున్నారు. దీని ధర రూ.10 లక్షల నుంచి మొదలవుతుంది.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌లో కంపెనీ ఈసారి చాలా మార్పులు చేస్తుందని అంచనాలు చెబుతున్నాయి. అంతే కాదు, ఇంటీరియర్‌లో కూడా పెను మార్పులను చూడచ్చు. కానీ కొత్త పంచ్‌లో అదే 1.2L పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. కొత్త మోడల్ ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ కూడా ఉంటాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఈవీ

మహీంద్రా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 3XO ను విడుదల చేయబోతోంది. అయితే ఈసారి ఎలక్ట్రిక్ అవతార్‌లో రానుంది. ప్రస్తుతం ఈ వాహనం టెస్టింగ్‌లో ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఈవీ ఒక ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 12 నుంచి మొదలై, 15 లక్షల వరకు ఉంటుంది. కారు డిజైన్‌లో కూడా కొన్ని మార్పులు చూడచ్చు.

Tags:    

Similar News