Unsafe Cars: ఈ కార్లలో భద్రత డొల్ల.. క్రాష్ టెస్ట్‌లో దారుణమైన రేటింగ్..!
Unsafe Cars: ఇండియాలో కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. సరికొత్త ఫీచర్స్‌తో చాలా మంది కొత్త కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు.
Unsafe Cars: ఈ కార్లలో భద్రత డొల్ల.. క్రాష్ టెస్ట్‌లో దారుణమైన రేటింగ్..!
Unsafe Cars: ఇండియాలో కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. సరికొత్త ఫీచర్స్‌తో చాలా మంది కొత్త కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కార్ కొనాలనే వారి ప్రయారిటీ సేఫ్టీ. దేశంలో భద్రత పరంగా బెస్ట్ కార్లంటే టాటా, మహీంద్రా గుర్తొస్తున్నాయి. మరి భద్రత విషయంలో దారుణంగా ఉన్న కార్లు ఏవి? క్రాష్ టెస్ట్‌లో వాటి రేటింగ్ ఎంత? తదితర వివరాలు తెలుసుకుందాం.
మారుతి వ్యాగన్ఆర్
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అమ్మకాల పరంగా దేశంలోనే నంబర్ 1 కారు. కానీ ఈ కారు భద్రత విషయంలో ఘోరంగా విఫలమైంది. ఈ కారు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఇప్పటికీ ఈ కారు సేల్స్ తగ్గడం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కారును సురక్షితంగా మార్చడానికి కంపెనీ ఎటువంటి మార్పులు చేయకపోవడం. వ్యాగన్ ఆర్ పెద్దల భద్రతలో 1 స్టార్ రేటింగ్, పిల్లల భద్రతలో జీరో స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 అత్యంత సౌకర్యవంతమైన కారు. ఈ కారు సిటీ డ్రైవ్ నుండి హైవే వరకు సాఫీగా నడుస్తుంది. కానీ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారకు 2 స్టార్ రేటింగ్ వచ్చింది. ప్రమాదం జరిగినప్పుడు ఈ కారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచదు.
రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ క్విడ్ డిజైన్ కార్ ప్రియులను ఆకర్షిస్తుంది. కానీ భద్రత పరంగా ఈ కారు భారీ ఫ్లాప్ అని నిరూపించింది. అంతే కాదు, ఈ కారు ఇంజన్ కూడా నిరాశ పరుస్తుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 2 స్టార్ రేటింగ్ వచ్చింది. రెనాల్డ్ కివిడ్ విక్రయాలు కూడా నిరంతరం పడిపోతున్నాయి.