Upcoming Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్లు డిమాండ్.. త్వరలో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు

Update: 2025-02-11 14:34 GMT

Upcoming Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్లు డిమాండ్.. త్వరలో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు

Upcoming Electric Scooters: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెట్రోల్, డీజిల్ అధిక ధరల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీవీఎస్, సుజికి కంపెనీలు మార్కెట్లోకి కొత్త మోడల్స్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ధర, ఫీచర్స్, రేంజ్ తదితర వివరాలు తెలుసుకుందాం.

టీవీఎస్ జూపిటర్ ఈవీ

టీవీఎస్ మోటర్స్ తన మొదటి సిఎన్‌జి స్కూటర్‌ను ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేసింది. ఇప్పుడు కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. కంపెనీ జూపిటర్ ఈవీని మాత్రమే మార్కెట్లోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఉన్న జూపిటర్‌తో పోలిస్తే, కొత్త ఈవీ డిజైన్‌ కాస్త భిన్నంగా ఉంటుంది.

ప్రస్తుతానికి ఈ స్కూటర్ ధర, బ్యాటరీ కెపాసిటీ, రేంజ్ గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, బ్యాటరీ, రేంజ్ ప్రస్తుతం ఉన్న ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగానే ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి.

సుజుకి బర్గ్‌మాన్ ఈవీ

సుజుకి తన పాపులర్ స్కూటర్ బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను దేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ సంవత్సరం డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బర్గ్‌మ్యాన్ బ్యాటరీ, రేంజ్ వివరాలు బయటకురాలేదు. అయితే ఈ స్కూటర్ రేంజ్ సుమారు 90 కిమీ-110 కిమీ వరకు ఉండొచ్చని లీక్స్ వస్తున్నాయి. అలానే ప్రతి సంవత్సరం 25,000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Tags:    

Similar News