Toyota Urban Cruiser Hyryder: ఈ కారంటే ఎంత క్రేజో.. వెయిటింగ్ పీరియడ్ 10 మంత్స్ ఓన్లీ
Toyota Urban Cruiser Hyryder: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వెయిటింగ్ పీరియడ్ 10 నెలలకు చేరుకుంది.
Toyota Urban Cruiser Hyryder: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వెయిటింగ్ పీరియడ్ 10 నెలలకు చేరుకుంది. దేశంలోని వివిధ నగరాల్లోని డిమాండ్ ప్రకారం.. వెయిటింగ్ పీరియబ్ 1 నెల నుంచి10 నెలల వరకు ఉంటుంది. అధిక డిమాండ్ కారణంగా కంపెనీ ఇతర మోడళ్లతో పోలిస్తే ఈ కారుపై తక్కువ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ వెహికలపై ఎక్స్ఛేంజ్ బోనస్ మాత్రమే అందిస్తోంది. హైరైడర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.14 లక్షలు. ఈ కారు ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG వేరియంట్‌లో 1.5 లీటర్ K-సిరీస్ ఇంజన్‌ను ఉంది.ఈ ఇంజన్ 5500ఆర్‌పిఎమ్ వద్ద 86.63 బిహెచ్‌పి పవర్, 4200ఆర్‌పిఎమ్ వద్ద 121.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. టయోటా ఇంతకుముందు దాని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజాను ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్‌తో పరిచయం చేసింది.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNGలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. హైరైడర్ సిఎన్‌జి మైలేజ్ 26.6 KM/KG. గ్రాండ్ విటారా CNG మైలేజ్ కూడా అదే. హైరైడర్ స్ట్రాంగ్-హైబ్రిడ్‌లో 0.76కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఇండియన్ ధృవీకరించిన మైలేజీ 29.97 KMPL.
అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్ట్ కార్ టెక్నాలజీ, ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.
అంతేకాకుండా హైరైడర్‌లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు టయోటా i-కనెక్ట్ సాఫ్ట్‌వేర్ కూడా ఉంది. ఈ సాఫ్ట్‌వేర్ డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది. ఈ నెలలో ఈ కారును కొనుగోలు చేయడం ద్వారా రూ.20 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. కంపెనీ తన G, V వేరియంట్‌పై రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, S, E వేరియంట్‌పై రూ. 11,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది.