Toyota Land Cruiser Prado: ఆ కార్లకు గట్టి పోటీ ఖాయమా?.. టయోటా నుంచి బలమైన కారు వచ్చేస్తోంది..!

Toyota Land Cruiser Prado: టయోటా తన కొత్త కారు ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోను ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ కారు త్వరలో దేశీయ రోడ్లపైకి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Update: 2025-02-16 09:51 GMT

Toyota Land Cruiser Prado: ఆ కార్లకు గట్టి పోటీ ఖాయమా?.. టయోటా నుంచి బలమైన కారు వచ్చేస్తోంది..!

Toyota Land Cruiser Prado: టయోటా తన కొత్త కారు ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోను ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ కారు త్వరలో దేశీయ రోడ్లపైకి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కంపెనీ అధికారికంగా దాని గురించి ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు. అలానే ఈ కారును ఆటో ఎక్స్‌పో 2025లో కూడా ప్రదర్శించలేదు. టయోటా చాలా కాలం క్రితం ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోను రిలీజ్ చేసింది. కాబట్టీ కంపెనీ ప్రాడోను మళ్లీ తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో అప్‌డేట్ వెర్షన్ ఫ్లాట్‌బెడ్ పికప్ ట్రక్‌లా కనిపిస్తుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ లైనప్ వంటి ప్రీమియం వాహనాలకు టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో గట్టిపోటినిస్తుంది. ప్రాడోలో పవర్ ఫుల్ ఎక్స్‌టీరియర్, ప్రీమియం ఇంటీరియర్‌ ఉంటుంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఈ ప్రత్యేక యూనిట్‌ బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో NL రిజిస్ట్రేషన్ ప్లేట్‌లతో ట్రాన్స్‌పోర్టర్ ట్రక్కుపై కనిపించింది. ప్రాడోలో మార్కెట్‌ను బట్టి ప్రత్యేకమైన ఫీచర్లను అందించే అవకాశం ఉంది.

కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోలో స్క్వారీష్ LED హెడ్‌లైట్ డిజైన్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, రాక్ స్లైడర్, లేటెస్ట్ స్టీరింగ్ వీల్, భారీ గేర్ సెలెక్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సీట్ వెంటిలేషన్ , హీటింగ్ ఫంక్షన్‌తో ఫిజికల్ క్లైమేట్ కంట్రోల్ బటన్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ప్రాడో ఇంజన్ విషయానికి వస్తే.. 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉంది, ఇదే ఇంజన్ ఫార్చ్యూనర్‌లో కూడా ఉంది. అయితే ఈ ఇంజన్‌లో 48V మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌ ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పి పవర్, 500 ఎమ్ఎమ్ పీక్ టార్క్‌ను టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇంజన్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ కారు ధర సుమారు రూ. 1.7 కోట్ల ఎక్స్ షోరూమ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. 2025 చివరి నాటికి లాంచ్ అవుతుందని సమాచారం.

Tags:    

Similar News