Honda Dio 125 X-Edition : ఆఫీసుకైనా, కాలేజీకైనా..డియో 125 X-ఎడిషన్ ఉంటే ఆ కిక్కే వేరు బాసూ!

ఆఫీసుకైనా, కాలేజీకైనా..డియో 125 X-ఎడిషన్ ఉంటే ఆ కిక్కే వేరు బాసూ!

Update: 2026-02-05 05:00 GMT

Honda Dio 125 X-Edition : హోండా కంపెనీ తన ఐకానిక్ స్కూటర్ డియోను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. తాజాగా విడుదల చేసిన డియో 125 X-ఎడిషన్ స్కూటర్ కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అదొక స్టైల్ స్టేట్‌మెంట్‌గా నిలవనుంది. రోజువారీ ప్రయాణాల్లో ఎలాంటి రాజీ పడకుండా, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం దీనిని రూపొందించారు. దీని ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.87,733 గా నిర్ణయించింది. 125cc సెగ్మెంట్లో ఇప్పటికే మంచి పట్టున్న హోండా, ఈ కొత్త మోడల్‌తో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.

డియో 125 X-ఎడిషన్ బాడీ ప్యానెల్స్‌పై ప్రత్యేకమైన X-ఎడిషన్ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇవి స్కూటర్‌కు స్పోర్టీ, అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. ముఖ్యంగా సైబర్ డ్రిఫ్ట్ థీమ్ నుండి ప్రేరణ పొంది రూపొందించిన పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పర్ల్ సైరన్ బ్లూ డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ అందరినీ ఆకట్టుకుంటుంది. వీటితో పాటు మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తున్న కలర్డ్ అలాయ్ వీల్స్ స్కూటర్ అందాన్ని రెట్టింపు చేశాయి. యువతను, యంగ్ ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ డిజైన్ మార్పులు చేశారు.

సాంకేతిక వివరాల విషయానికి వస్తే.. ఇందులో 123.92 cc, 4-స్ట్రోక్ SI ఇంజిన్ అమర్చారు. ఇది 6,500 rpm వద్ద 8.4 PS పవర్, 5,000 rpm వద్ద 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండాకు చెందిన PGM-FI ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ వల్ల ఇంజిన్ పనితీరు స్మూత్‌గా ఉండటమే కాకుండా, మెరుగైన మైలేజీ కూడా లభిస్తుంది. సిటీ రోడ్లపై సులువుగా ప్రయాణించేందుకు వీలుగా 162 mm గ్రౌండ్ క్లియరెన్స్, కేవలం 107 కేజీల బరువుతో దీనిని రూపొందించారు.

ఈ స్కూటర్ పొడవు 1,850 mm, వెడల్పు 707 mm, ఎత్తు 1,160 mm గా ఉంది. 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంతో వస్తున్న ఈ స్కూటర్, సిటీ రైడింగ్‌కు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. హోండా డియో 125 X-ఎడిషన్ బుకింగ్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు హోండా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. దీని డెలివరీలు ఫిబ్రవరి 2026 రెండో వారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News