TVS Raider 125: యువత ఫేవరెట్ రైడర్‌కు ధరల సెగ.. టీవీఎస్ కీలక నిర్ణయం..!

TVS Raider 125: నేటితరం యువత మనసు దోచుకున్న స్టైలిష్ బైక్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు టీవీఎస్ రైడర్.

Update: 2026-02-02 14:30 GMT

TVS Raider 125: యువత ఫేవరెట్ రైడర్‌కు ధరల సెగ.. టీవీఎస్ కీలక నిర్ణయం..!

TVS Raider 125: నేటితరం యువత మనసు దోచుకున్న స్టైలిష్ బైక్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు టీవీఎస్ రైడర్. మెరుపు లాంటి వేగం, మతిపోయే స్పోర్టీ లుక్‌తో రోడ్లపై రారాజులా దూసుకెళ్లే ఈ బైక్.. ఇప్పుడు కొనుగోలుదారుల జేబుకు కాస్త చిల్లు పెట్టనుంది. మధ్యతరగతి వినియోగదారులకు షాకిస్తూ టీవీఎస్ మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ 125సీసీ మోటార్ సైకిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రైడర్ సిరీస్ ధరలు పెరగడం ఇప్పుడు వాహన రంగంలో చర్చనీయాంశంగా మారింది.

ఈ ధరల పెరుగుదల వెంటనే అమల్లోకి వస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. పెరిగిన ఖర్చులు, తయారీ వ్యయం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం వివిధ వేరియంట్లను బట్టి ధరల పెంపు భిన్నంగా ఉంది. గరిష్టంగా 1,250 రూపాయల వరకు ధర పెరిగినట్లు సమాచారం. ఇది స్వల్ప మొత్తమే అనిపించినా, బడ్జెట్ ధరలో బైక్ కొనాలనుకునే సామాన్యులపై దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వేరియంట్ల వారీగా చూస్తే డ్రమ్ వేరియంట్ పై అత్యధికంగా 1,250 రూపాయల భారం పడింది. సింగిల్ సీట్ మోడల్ ధర 950 రూపాయలు పెరగగా, స్ప్లిట్ సీట్ , ఐగో వేరియంట్లపై 900 రూపాయల వరకు అదనపు భారం పడనుంది. అలాగే యువతను బాగా ఆకర్షించే సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ధర కూడా 900 రూపాయలు ఎగబాకింది. వీటితో పాటు ఎస్ఎక్స్ సీ డీడీ, టీఎఫ్ టీ డీడీ వంటి హై-ఎండ్ వేరియంట్లపై వరుసగా 925, 950 రూపాయల మేర ధరలు పెరిగాయి.

ధరల పెంపు తర్వాత టీవీఎస్ రైడర్ 125 బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు 82,000 రూపాయల నుంచి ప్రారంభమవుతోంది. ఇక అన్ని హంగులు ఉన్న టాప్-ఎండ్ వేరియంట్ ధర 97,050 రూపాయల మార్కును తాకింది. ఆన్-రోడ్ ధరకు వచ్చేసరికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరిగినప్పటికీ, ఈ సెగ్మెంట్లో ఉన్న ఫీచర్లు, టెక్నాలజీ, మైలేజీ కారణంగా రైడర్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుతం 125సీసీ సెగ్మెంట్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ, టీవీఎస్ రైడర్ తనదైన శైలిలో దూసుకుపోతోంది. ముఖ్యంగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఈ బైక్‌ను స్పెషల్‌గా నిలుపుతున్నాయి. ఇప్పుడు ధరలు పెరిగిన నేపథ్యంలో కొనుగోలుదారులు తమ బడ్జెట్‌ను మళ్లీ లెక్కవేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ధరల పెరుగుదల సేల్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News