Hyundai i20 : హ్యుందాయ్ షాకింగ్ నిర్ణయం..రికార్డు స్థాయిలో తగ్గిన i20 రేట్లు..ఏకంగా రూ.లక్ష ఆదా
హ్యుందాయ్ షాకింగ్ నిర్ణయం..రికార్డు స్థాయిలో తగ్గిన i20 రేట్లు..ఏకంగా రూ.లక్ష ఆదా
Hyundai i20 : మిడిల్ క్లాస్ కారు ప్రియులకు హ్యుందాయ్ ఇండియా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. తన పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ i20 ధరలను భారీగా తగ్గించి మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. సన్‌రూఫ్ ఫీచర్ కావాలనుకునే వారు ఇకపై లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. కేవలం రూ.6.99 లక్షలకే ఆ లగ్జరీ సొంతం చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా హ్యుందాయ్ ఈ వ్యూహాత్మక అడుగు వేసింది. హ్యుందాయ్ తన i20 లైనప్‌లో కొన్ని కీలక మార్పులు చేస్తూ ధరలను సవరించింది. కొత్తగా ప్రవేశపెట్టి ఎరా వేరియంట్ ఇప్పుడు బేస్ మోడల్‌గా మారింది. దీని ధర కేవలం రూ.5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది. ధర తగ్గించినప్పటికీ, సేఫ్టీ విషయంలో హ్యుందాయ్ ఎక్కడా రాజీ పడలేదు. బేస్ వేరియంట్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టైప్-సి ఛార్జర్ వంటి ఆధునిక ఫీచర్లను అందిస్తోంది. దీనివల్ల బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారికి సెకండ్ హ్యాండ్ కార్ల వైపు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
చాలామంది కారు పైన సన్‌రూఫ్ ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం మాగ్నా వేరియంట్ ధరను రూ.6.99 లక్షలకు తగ్గించింది. ఈ మోడల్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో పాటు ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, రియర్ ఏసీ వెంట్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్ రూ.6.74 లక్షలకే లభించనుంది. ఇందులో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, కీ-లెస్ ఎంట్రీ, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లు ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో ప్రస్తుతం i20 ఒక్కటే అని చెప్పవచ్చు.
హ్యుందాయ్ i20లో నమ్మకమైన 1.2 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 83 bhp పవర్, 114.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. మెరుగైన మైలేజీ కోసం ఇందులో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ టెక్నాలజీని కూడా వాడారు. అదనంగా రూ.14,999 చెల్లిస్తే, డీలర్ల వద్ద 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి హై-ఎండ్ ఫీచర్లను కూడా అమర్చుకోవచ్చు. 3 ఏళ్ల స్టాండర్డ్ వారంటీతో వస్తున్న ఈ కారు ఇప్పుడు మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది.