Toyota Glanza Festival Edition: పండుగ స్పెషల్.. గ్లాంజా ఫెస్టివ్ ఎడిషన్ లాంచ్..!
Toyota Glanza Festival Edition: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) పండుగ సీజన్ కోసం తన శ్రేణిలో మరో ప్రత్యేక వేరియంట్‌ను పరిచయం చేసింది. గ్లాంజా ఫెస్టివ్ ఎడిషన్ తీసుకొచ్చింది.
Toyota Glanza Festival Edition
Toyota Glanza Festival Edition: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) పండుగ సీజన్ కోసం తన శ్రేణిలో మరో ప్రత్యేక వేరియంట్‌ను పరిచయం చేసింది. గ్లాంజా ఫెస్టివ్ ఎడిషన్ తీసుకొచ్చింది. ఇది బ్రాండ్ టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (TGA) ప్యాకేజీ ద్వారా రూ. 20,567 విలువైన ఉచిత యాక్సెసరీస్‌తో వస్తుంది. ఈ నెలలో బ్రాండ్ ప్రారంభించిన మూడవ ప్రత్యేక వేరియంట్ ఇది. దాని వివరాలను తెలుసుకుందాం.
యాక్సెసరీస్ సెట్‌లో క్రోమ్, బ్లాక్ బాడీ సైడ్ మౌల్డింగ్స్, రియర్ డోర్స్, ORVMల కోసం క్రోమ్ ఇన్సర్ట్‌లు, రియర్ రిఫ్లెక్టర్లు, ఫెండర్లు, రియర్ బంపర్ వంటి 13 యాక్సెసరీస్ సెట్‌లు ఉన్నాయి. ఈ ఆఫర్ 31 అక్టోబర్ 2024 వరకు అందుబాటులో ఉంటుంది.
ఇది కాకుండా ప్రత్యేక వేరియంట్ గ్లాంజాలో 3డి ఫ్లోర్‌మ్యాట్‌లు, డోర్ వైజర్, బ్లాక్, సిల్వర్ కలర్స్‌తో కూడిన నెక్ కుషన్, వెల్‌కమ్ డోర్ ల్యాంప్ ఉన్నాయి.కొత్త గ్లాంజా ఫెస్టివ్ ఎడిషన్‌లో 1.2 లీటర్, NA పెట్రోల్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్, AMT యూనిట్‌లతో అటాచ్ చేసి ఉంటాయి. ఈ కార్లు కస్టమర్ల కోసం CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా ఎంచుకోవడానికి నాలుగు వేరియంట్లు, 5 కలర్ ఆప్షన్లు ఉన్నాయి.
భారతదేశంలో మొత్తం 12 టయోటా మోడల్‌లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వీటిలో 1 హ్యాచ్‌బ్యాక్, 5 SUVలు, 4 MUV, 1 పికప్ ట్రక్, 1 సెడాన్ ఉన్నాయి. టయోటా క్యామ్రీ 2024, టయోటా ల్యాండ్ క్రూయిజర్ 250 వంటి 2 కొత్త కార్లను టయోటా భారతదేశంలో విడుదల చేస్తుంది.