Cheapest Cars With 6 Airbags: సేఫ్టీలో వీటికి తిరుగులేదు.. తక్కువ ధరకే 6 ఎయిగ్‌బ్యాగ్స్..!

Cheapest Cars With 6 Airbags: రాబోయే కాలంలో అన్ని కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్ ఫీచర్‌లుగా అందుబాటులోకి రానున్నాయి.

Update: 2025-03-08 08:59 GMT

Cheapest Cars With 6 Airbags: రాబోయే కాలంలో అన్ని కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్ ఫీచర్‌లుగా అందుబాటులోకి రానున్నాయి. కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు భద్రతపై కూడా దృష్టి పెడుతున్నారు. కార్ల కంపెనీలు కూడా ఇప్పుడు మంచి కార్లను డిజైన్ చేస్తున్నాయి. చాలా మంచి మోడల్స్ తక్కువ ధరలకు లభిస్తున్నాయి. మీరు కూడా 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో సరసమైన కారు కొనాలని చూస్తుంటే రూ. 4.23 లక్షల నుండి ప్రారంభమయ్యే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Maruti Alto K10

దేశంలోనే అత్యంత చవకైన కారు ఆల్టో కె10 ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఆల్టో కె10 బేస్ వేరియంట్ (స్టాండర్డ్) ధర రూ.4.23 లక్షలుగా మారింది. ఈ కారులో 4 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇది రోజువారీ వినియోగానికి మంచి కారు, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్, డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ కారులో 1.0L K10C పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 49KW పవర్ , 89Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్, AGS గేర్‌బాక్స్ సౌకర్యం ఉంటుంది.

Maruti Celerio

ఇప్పుడు మీరు మారుతి సుజుకి సెలెరియో బేస్ మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా చూస్తారు. సెలెరియో ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.64 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు పెట్రోల్,CNGలో అందుబాటులో ఉంది. ఈ కారులో మంచి స్థలం ఉంది,ఇందులో 5 మంది సులభంగా కూర్చోవచ్చు. భద్రత కోసం సెలెరియో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన ABS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు మునుపటి కంటే సురక్షితంగా మారింది. పనితీరు కోసం సెలెరియోకు 1.0 లీటర్ K10C పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 65 హెచ్‌పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Hyundai Grand i10 Nios

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన కార్ల జాబితాలో చేరింది. ఇప్పుడు మీరు ఈ కారులో ప్రామాణిక ఫీచర్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్ చూస్తారు. ఇందులో 1.2L పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఈ కారు లీటరుకు 18-20 కి.మీ మైలేజీని అందిస్తుంది. కారులో 5 మంది కూర్చునే స్థలం ఉంది. ఈ కారులో మీరు చాలా మంచి స్థలాన్ని చూస్తారు. కారులో ఫీచర్లకు కూడా లోటు లేదు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.92 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Tags:    

Similar News