Best Affordable CNG Cars: రూ.10 లక్షల్లోపు బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే.. మంచి మైలేజీతో సిటీల్లో బెస్ట్!

Best Affordable CNG Cars: దేశంలో డీజిల్, పెట్రలో ధరల పెరుగుదలతో వినియోగదారులు ఎలక్ట్రిక్, సీఎన్‌జీ కార్ల వైపు చూస్తున్నారు.

Update: 2025-02-23 05:15 GMT

Best Affordable CNG Cars: దేశంలో డీజిల్, పెట్రలో ధరల పెరుగుదలతో వినియోగదారులు ఎలక్ట్రిక్, సీఎన్‌జీ కార్ల వైపు చూస్తున్నారు. మీరు రానున్న రోజుల్లో సీఎన్‌జీ కారు కొనాలని చూస్తుంటే.. మీకు బోలేడు ఆప్షన్స్ మార్కెట్లో ఉన్నాయి. దాదాపు రూ.10 లక్షల బడ్జెట్‌లోనే సీఎన్‌జీ కార్లు దొరుకుతాయి. ఈ సెగ్మెంట్‌లో మూడు అత్యుత్తమ వాహనాల గురించి తెలుసుకుందాం.

టాటా పంచ్

టాటా పంచ్ దేశంలో అత్యంత చౌకైన, అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో ఎస్‌యూవీ. దేశీయ విపణిలో ఈ కారు ప్రారంభ ధర రూ.6 లక్షల ఎక్స్-షోరూమ్. సీఎన్‌జీ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.30 లక్షలు. ఈ ఎస్‌యూవీలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది. సీఎన్‌జీ మోడల్‌ గరిష్టంగా 73.5బీహెచ్‌పి పవర్, 103ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. పంచ్ సీఎన్‌జీ కిలోగ్రాముకు 27 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది.

మారుతి సుజుకి స్విఫ్ట్

మీకు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కావాలంటే అప్‌డేట్ చేసిన స్విఫ్ట్ CNG మోడల్‌ బెస్ట్ ఆప్షన్. స్విఫ్ట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షలు మాత్రమే. అయితే సీఎన్‌జీ వేరియంట్ ధర రూ. 8.19 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. మారుతి స్విఫ్ట్‌లో 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ పవర్‌ట్రెయిన్ సీఎన్‌జీ వేరియంట్‌లో 69.75బీహెచ్‌పీ పవర్, 101.8ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి ప్రకారం.. స్విఫ్ట్ సీఎన్‌జీ కిలోగ్రాముకు 32.85 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు. కారులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి.

మారుతి సుజుకి డిజైర్

మీరు సెడాన్ ప్రేమికులైతే.. కొత్త డిజైర్ చాలా సరసమైన ఎంపిక. దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కూడా ఇదే. డిజైర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.6.84 లక్షలు. కాగా, సీఎన్‌జీ మోడల్ ప్రారంభ ధర రూ. 8.79 లక్షలు. ఈ సెడాన్‌లో 1.2-లీటర్ త్రీ-సిలిండర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది. సీఎన్‌జీతో పవర్ అవుట్‌పుట్ 70 పీఎస్ పపర్, 102 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. మైలేజ్ కిలోకు 33.73 కిమీ. ఈ సెడాన్‌లో స్టాండర్డ్ సేఫ్టీగా 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

Tags:    

Similar News