Cars for Middle Class: మధ్యతరగతి కుటుంబానికి బెస్ట్ కార్లు.. ధర చాలా తక్కువ, మైలేజ్ అదుర్స్..!

Cars for Middle Class: దేశంలో పెద్ద సంఖ్యలో మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. జీవితంలో కొత్త కారు కొనాలనే కోరిక వీరికి ఉంటుంది. కానీ, ఏ కారు కొనాలో తెలియక తికమక పడుతున్నారు.

Update: 2025-02-23 14:31 GMT

Cars for Middle Class: మధ్యతరగతి కుటుంబానికి బెస్ట్ కార్లు.. ధర చాలా తక్కువ, మైలేజ్ అదుర్స్..!

Cars for Middle Class: దేశంలో పెద్ద సంఖ్యలో మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. జీవితంలో కొత్త కారు కొనాలనే కోరిక వీరికి ఉంటుంది. కానీ, ఏ కారు కొనాలో తెలియక తికమక పడుతున్నారు. కాబట్టి, ఇప్పడు అతి తక్కువ ధర, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన వేవ్ మొబిలిటీ ఎవా,మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్, మారుతి సుజుకి ఆల్టో కె10 గురించి వివరంగా తెలుసుకుందాం.

వేవ్ మొబిలిటీ ఎవా

ముందుగా వేవ్ మొబిలిటీ ఎవా కారు గురించి మాట్లాడుకుందాం. ఎవా సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు. ధర రూ.3.25 లక్షల నుండి రూ.4.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). కారులో 12.6 , 18 కిలోవాట్ సామర్థ్యాల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఫుల్ ఛార్జింగ్ పై 250 కిలోమీటర్ల రేంజ్ (మైలేజీ) అందిస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపికతో కారు కేవలం 45 నిమిషాల్లో 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇందులో 2 సీట్ల ఆప్షన్ సిస్టమ్ ఉంది, డ్యూయల్ డిజిటల్ డిస్ప్లేలతో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో విషయానికొస్తే.. ఈ కారు ధర రూ.4.26 లక్షలు నుంచి గరిష్ట ధర రూ.6.11 లక్షలు ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఈ కారులో 1-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్/5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. లీటర్‌పై 24.12 నుండి 32.73 kmpl మైలేజీని ఇస్తుంది. ఎస్-ప్రెస్సో కారులో 5 మంది కూర్చోవచ్చు. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రేర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఆల్టో కె10 కూడా ప్రముఖ హ్యాచ్‌బ్యాక్. ఈ కారు ధర రూ.4.09 లక్షల నుండి రూ.6.04 లక్షలు ఎక్స్-షోరూమ్. పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్స్ కారులో ఉన్నాయి. లీటర్‌పై 24.39 నుండి 33.85 kmpl మైలేజీని అందిస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌లతో సహా వివిధ ఫీచర్లను చూడచ్చు.

రెనాల్ట్ క్విడ్

చివరగా రెనాల్ట్ క్విడ్ విషయానికి వస్తే ఈ కారు ధర రూ. 4.70 లక్షల నుండి రూ. 6.45 లక్షలు ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. 1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 21.46 నుండి 22.3 kmpl మైలేజీని అందిస్తుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ . మాన్యువల్ ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News