Car Loan: ఈ 5 బ్యాంకులు కారు లోన్‌ చౌకగా అందిస్తున్నాయి.. ఈఎంఐ ఎంతంటే..?

Car Loan: కారు కొనాలని చాలా మందికి ఉంటుంది కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించగా వాయిదా వేస్తూ ఉంటారు. నిజానికి కారు ప్రారంభ ధర రూ.7 నుంచి 8 లక్షల వరకు ఉంటుంది.

Update: 2023-09-11 15:00 GMT

Car Loan: ఈ 5 బ్యాంకులు కారు లోన్‌ చౌకగా అందిస్తున్నాయి.. ఈఎంఐ ఎంతంటే..?

Car Loan: కారు కొనాలని చాలా మందికి ఉంటుంది కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించగా వాయిదా వేస్తూ ఉంటారు. నిజానికి కారు ప్రారంభ ధర రూ.7 నుంచి 8 లక్షల వరకు ఉంటుంది. ఇంత మొత్తం ఒక్కసారి చెల్లించలేరు కాబట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కారు కొనడానికి రూ.5 లక్షల వరకు రుణం అందిస్తారు. మిగిలిన డౌన్‌పేమెంట్‌ను సొంత జేబులో నుంచి ఖర్చుచేయాలి. అయితే తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తున్న ఐదు ప్రభుత్వ బ్యాంకుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కెనరా బ్యాంక్: మీరు కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే కెనరా బ్యాంక్ నుంచి రుణం తీసుకోవచ్చు. ప్రస్తుతం 8.80 నుంచి 11.95 శాతం వడ్డీకి కార్ లోన్ అందిస్తోంది. ఇందుకోసం ఎక్కువగా EMI చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు రూ.5 లక్షల వరకు రుణం తీసుకుంటే నెలవారీ EMI రూ.10,331 నుంచి రూ.11,110 మధ్య ఉంటుంది. అలాగే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: స్టేట్ బ్యాంక్ నుంచి 5 లక్షల రూపాయల వరకు కారు రుణం తీసుకుంటే 8.65 నుంచి 9.70 శాతం వడ్డీ చెల్లించాలి. నెలవారీ EMI రూ.10,294 నుంచి రూ. 10,550 మధ్య ఉంటుంది. అయితే రుణ మొత్తంలో 0.25 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి కారు రుణం తీసుకుంటే 8.75 నుంచి 9.60 శాతం వరకు వడ్డీ చెల్లించాలి. EMIగా ప్రతి నెలా రూ.10,319 నుంచి రూ.10,525 వరకు చెల్లించాలి. PNB బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం ఇది రూ.1,000 నుంచి 1,500 వరకు ఉంటుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం కార్ లోన్‌పై 8.75 నుంచి 10.50 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. నెలవారీ EMI రూ.10,319 నుంచి రూ. 10,747 మధ్య ఉంటుంది. బ్యాంక్ రూ.1,000 వరకు ప్రాసెసింగ్ ఛార్జీని వసూలు చేస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా: బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కారు రుణం తీసుకుంటే 8.70 నుంచి 12.20 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. అయితే నెలకు EMI రూ.10,307 నుంచి రూ.11,173 మధ్య ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1,500 నుంచి 2,000 వరకు వసూలు చేస్తుంది.

Tags:    

Similar News