Maruti Top Selling Car: అయ్యగారే మళ్లీ నంబర్-1.. అన్ని కార్లను వెనక్కి నెట్టేసిన వ్యాగన్ఆర్..!
Maruti Top Selling Car: ఫిబ్రవరి 2025లో దేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితా వెల్లడైంది. ఈ జాబితాలో అత్యంత షాకింగ్ డేటా బయటపడింది.
Maruti Top Selling Car: ఫిబ్రవరి 2025లో దేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితా వెల్లడైంది. ఈ జాబితాలో అత్యంత షాకింగ్ డేటా బయటపడింది. గత నెలలో మారుతి సుజుకి దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారు. కంపెనీ 21,461 యూనిట్లను విక్రయించింది. 20 వేల యూనిట్లకు పైగా విక్రయించిన ఏకైక కారు ఇదే. కాగా, మారుతి వ్యాగన్ఆర్ రెండో స్థానంలో నిలిచింది. 19,879 యూనిట్ల వ్యాగన్‌ఆర్ అమ్ముడయ్యాయి. అంటే హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఇది నంబర్-1 కారు. ఈ జాబితాలో మారుతి రెండవ హ్యాచ్‌బ్యాక్ కూడా చేరింది.
ఫిబ్రవరి విక్రయాల్లో మారుతి వ్యాగన్ఆర్ తన సొంత కంపెనీకి చెందిన టాప్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్‌లు స్విఫ్ట్, బాలెనోలను అధిగమించింది. అమ్మకాల పరంగా హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, టాటా పంచ్, మారుతి డిజైర్, మారుతి ఎర్టిగా వంటి మోడళ్లను అధిగమించింది. విశేషమేమిటంటే.. ఈ జాబితాలో టాప్-5లో చేరిన టాటా పంచ్ ఇప్పుడు 10వ స్థానానికి చేరుకుంది. వ్యాగన్ఆర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 564,500 లక్షలు.
Maruti Wagon R Features
మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో నావిగేషన్, క్లౌడ్ ఆధారిత సర్వీస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, హిల్-హోల్డ్ అసిస్ట్, సెమీ-మౌంటెడ్ వీలర్ కంట్రోల్స్, సెమీ-మౌంటెడ్ వీలర్ కంట్రోల్స్ ఉన్నాయి.
ఇందులో డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీతో 1.0-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్, 1.2-లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. 1.0-లీటర్ ఇంజన్ 25.19 kmpl మైలేజీని ఇస్తుంది. అయితే దాని CNG వేరియంట్ మైలేజ్ 34.05 kmpl. 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్ VVT ఇంజన్,క్క క్లెయిమ్ చేసిన ఇంధన సామర్థ్యం 24.43 kmpl.