Tata Nexon EV: నెక్సాన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి ఆ వేరియంట్ కనిపించదు..!
Tata Nexon EV: టాటా మోటార్స్ ఫేమస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్ ఈవీ మిడ్-స్పెక్ 40.5కిలోవాట్ బ్యాటరీ వెర్షన్‌ను శాశ్వతంగా నిలిపివేసింది.
Tata Nexon EV: నెక్సాన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి ఆ వేరియంట్ కనిపించదు..!
Tata Nexon EV: టాటా మోటార్స్ ఫేమస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్ ఈవీ మిడ్-స్పెక్ 40.5కిలోవాట్ బ్యాటరీ వెర్షన్‌ను శాశ్వతంగా నిలిపివేసింది. ఇప్పుడు ఈ కారులో కేవలం రెండు బ్యాటరీ ప్యాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇంతకుముందు ఇందులో మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ సెప్టెంబర్ 2023లో విడుదల చేసినప్పుడు ఆల్-ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 30కిలోవాట్, 40.5కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్‌లో అందించారు. టాటా ఒక సంవత్సరం తర్వాత 45కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను పరిచయం చేసింది.
టాటా నెక్సాన్ ఈవీ ఇప్పుడు 8 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. వాటిలో కొన్ని నిర్దిష్ట బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ప్రత్యేకమైనవి, అంటే ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో మొత్తం 10 వేరియంట్‌లు ఉన్నాయి. నెక్సాన్ 30కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 275కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో క్రియేటివ్ +, ఫియర్‌లెస్, ఫియర్‌లెస్ +, ఫియర్‌లెస్ +ఎస్, ఎంపవర్డ్ ట్రిమ్‌లలో వస్తుంది.
అదే సమయంలో నెక్సాన్ ఈవీ 45కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ రేంజ్ 489కిమీ. ఇందులో క్రియేటివ్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+, రెడ్ డార్క్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి.నెక్సాన్ ఈవీ ధర రూ. 14.59 లక్షల నుండి రూ. 16.29 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది.