TATA: ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో టాటా దూకుడు.. కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌ న్యూస్..!

TATA: ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ దేశంలో విద్యుత్‌ కార్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

Update: 2025-02-20 09:05 GMT

TATA: ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో టాటా దూకుడు.. కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌ న్యూస్..!

TATA: ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ దేశంలో విద్యుత్‌ కార్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక త్వరలోనే అమెరికాకు చెందిన టెస్లా సైతం భారత మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా కీలక మైలురాయిని దాటేసింది. టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకంలో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది.

టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒక పత్రికా ప్రకటనలో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో రెండు లక్షల యూనిట్లను దాటిందని తెలిపింది. ఈ సందర్భంగా, టాటా తన కస్టమర్ల కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది, ఇది రాబోయే 45 రోజుల పాటు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఇంతకీ ఏంటా ఆఫర్లు.? ఇవి కస్టమర్లకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా తన అన్ని ఎలక్ట్రిక్ కార్లపై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. టాటా అందించే ఈ ఆఫర్‌లో ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు 100 శాతం ఆన్-రోడ్ ఫైనాన్స్ ఆప్షన్ వంటివి ఉన్నాయి. దీంతో పాటు టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్ నుంచి ఉచిత ఛార్జింగ్ ప్రయోజన పరిమితిని కూడా కంపెనీ ఆరు నెలలు పెంచింది. ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై 7.2 kW AC ఫాస్ట్ హోమ్ ఛార్జర్‌ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశాన్ని కూడా కంపెనీ అందిస్తోంది.

టాటా తన కస్టమర్లకు లాయల్టీ బోనస్‌ను కూడా తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ఇప్పటికే ఎలక్ట్రిక్ కారు కలిగి ఉన్న టాటా కస్టమర్లతో పాటు కొత్త నెక్సాన్ EV లేదా కర్వ్ EV కొనుగోలు చేస్తే, వారికి రూ. 50 వేల వరకు లాయల్టీ బోనస్ ఇస్తోంది. ICE వేరియంట్‌లను కలిగి ఉన్న కస్టమర్లకు రూ. 20,000 వరకు లాయల్టీ బోనస్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే

భారత మార్కెట్లో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో టాటా మోటర్స్‌ ఒకటిగా నిలిచింది. టాటా ఇటీవల ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో హారియర్ EVతో పాటు సియెర్రా EVలను ప్రవేశపెట్టింది. టాటా కంపెనీకి చెందిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్లోకి విడుదల కానున్నాయి.

Tags:    

Similar News