Tata Ace Pro: టాటా నుంచి కొత్త ఏస్ ప్రో మినీ ట్రక్.. పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ ఆప్షన్లతో పాటు అదిరే ఫీచర్లు..!

Tata Ace Pro: సరుకు రవాణా కోసం తక్కువ ఖర్చుతో కూడిన వాహనం కావాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.

Update: 2025-06-26 04:47 GMT

Tata Ace Pro: టాటా నుంచి కొత్త ఏస్ ప్రో మినీ ట్రక్.. పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ ఆప్షన్లతో పాటు అదిరే ఫీచర్లు..!

Tata Ace Pro: సరుకు రవాణా కోసం తక్కువ ఖర్చుతో కూడిన వాహనం కావాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. దేశంలోనే పేరున్న ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్, ఇండియా కమర్షియల్ వెహికల్ మార్కెట్‌లోకి తన కొత్త మినీ ట్రక్ టాటా ఏస్ ప్రోను లాంచ్ చేసింది. ఇది ముఖ్యంగా చిన్న వ్యాపారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడింది.

ఈ కొత్త టాటా ఏస్ ప్రో మినీ ట్రక్‌ను పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ ఈ మూడు వేరియంట్లలో మార్కెట్‌లోకి తెచ్చారు. దీనివల్ల కొనుగోలుదారులు తమ అవసరం, బడ్జెట్‌ను బట్టి నచ్చిన మోడల్‌ను ఎంచుకోవచ్చు. టాటా ఏస్ ప్రో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 లక్షలు. ఈ సెగ్మెంట్‌లో ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుండటంతో, చిన్న వ్యాపారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఈ మినీ ట్రక్ 6.5 అడుగుల పొడవైన డెక్తో వస్తుంది. దీనిపై దాదాపు 750 కిలోగ్రాముల వరకు సరుకును సులభంగా రవాణా చేయవచ్చు. దీన్ని ఫ్యాక్టరీ ఫిటెడ్ లోడ్ బాడీతో అందిస్తున్నారు. కాబట్టి కస్టమర్లు మళ్లీ ప్రత్యేకంగా బాడీ తయారు చేయించుకోవాల్సిన అవసరం లేదు.

పెట్రోల్ వేరియంట్‌లో 694 సీసీ (cc) ఇంజిన్ ఉంటుంది. ఇది 30 బీహెచ్‌పీ పవర్‌ను, 55 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ వేరియంట్‌లో 26 బీహెచ్‌పీ పవర్‌ను, 51 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అవసరమైనప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ఇందులో 5 లీటర్ల పెట్రోల్ రిజర్వ్ ట్యాంక్ కూడా ఉంటుంది.

ఎలక్ట్రిక్ వెర్షన్ విషయానికి వస్తే, ఇది 38 బీహెచ్‌పీ పవర్‌ను, 104 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 155 కిలోమీటర్ల (కి.మీ.) వరకు నడుస్తుంది. ఇది నగరంలో సరుకు రవాణాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ.. టాటా ఏస్ ప్రో రవాణా రంగంలో ఒక కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తుంది. ఇది చిన్న వ్యాపారులకు ఆదాయం సంపాదించడానికి కొత్త అవకాశాలను తెరుస్తుందని అన్నారు.

ఈ ట్రక్‌ను బలంగా, సురక్షితంగా, లాభదాయకంగా ఉండేలా డిజైన్ చేశారు. రోడ్డుపై ఎక్కువ దూరం, ఎక్కువ కాలం నడిచేలా దీన్ని తయారు చేశారు. ఏస్ ప్రోలో ఎర్గోనామిక్ సీటింగ్ , మంచి స్టోరేజ్ స్పేస్, చాలా పవర్‌ఫుల్ ఫీచర్‌లతో కూడిన పెద్ద కార్ లాంటి క్యాబిన్ కూడా ఉంది.

Tags:    

Similar News