Tata Curvv EV : టాటా కర్వ్‌ ఎలక్ట్రిక్‌ కార్‌ వచ్చేసింది.. ఫీచర్లు మాత్రం సూపర్బ్‌..!

గత కొన్ని నెలలుగా ఊరిస్తున్న ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది. దేశీయ వ్యాపార దిగ్గజం టాటా మోటార్స్‌ భారత్‌లో మరో కొత్త ఎలక్ట్రిక్‌ కారు( Tata Curvv EV )ను విడుదల చేసింది.

Update: 2025-10-07 11:30 GMT

Tata Curvv EV : టాటా కర్వ్‌ ఎలక్ట్రిక్‌ కార్‌ వచ్చేసింది.. ఫీచర్లు మాత్రం సూపర్బ్‌..!

Tata Curvv EV: గత కొన్ని నెలలుగా ఊరిస్తున్న ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది. దేశీయ వ్యాపార దిగ్గజం టాటా మోటార్స్‌ భారత్‌లో మరో కొత్త ఎలక్ట్రిక్‌ కారు( Tata Curvv EV )ను విడుదల చేసింది. టాటా కర్వ్‌ ఈవీ పేరిట ఈ ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ధర, ఫీచర్లను పరిశీలిస్తే.. ఈ టాటా కర్వ్‌ ఈవీ 55 kWh, 44 kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఇవే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్‌లని కంపెనీ వెల్లడించింది. టాటా కర్వ్‌ ఈవీ 1.2C ఛార్జింగ్ రేట్‌ను కలిగి ఉంది. దీని సహాయంతో కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కిమీల రేంజ్‌ వరకు ప్రయాణించగలదు. ఇందులోని 123 kWh మోటారు కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 వేగాన్ని అందుకుంటుంది. అంతే కాకుండా ఇది గంటకు 160 కి.మీ టాప్‌ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, ఆల్‌ వీల్‌ డిస్క్‌ బ్రేక్స్‌, లెవెల్‌ 2 ఏడీఏఎస్‌, ఆటో హోల్డ్‌ వంటి భద్రతా ఫీచర్లు ఈ కారులో అమర్చారు. గరిష్ఠంగా 160 kmph వేగాన్ని అందుకుంటుంది.

అలాగే.. 500 లీటర్ల బూట్‌ స్పేస్‌ ఉంది. బీఎన్‌సీఏపీ 5 స్టార్‌ రేటింగ్‌ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 45 kWh వేరియంట్‌ 502 కిలోమీటర్లు, 55 kWh వేరియంట్‌ 585 కిలోమీటర్లు రేంజ్‌ను ఇస్తుందని వెల్లడించింది. రియల్‌ వరల్డ్‌ కండిషన్స్‌లో వరుసగా ఈ దూరం 350 కి.మీ, 425 కి.మీ. వరకు ఉండొచ్చని తెలిపింది. ఈ కార్ల ధరల శ్రేణి రూ.17.49 లక్షల నుంచి రూ.21.99 లక్షల మధ్య ఉంది. ఈ కొత్త కూపే ఎస్‌యూవీని ఆగస్టు 12 నుంచి బుకింగ్ చేసుకోవచ్చు.

ఈవీ కార్లు ఎలాంటి సౌండ్‌ చేయకుండా ప్రయాణిస్తాయి కనుక పాదచారులను అప్రమత్తం చేసేలా ప్రత్యేక సౌండింగ్‌ సిస్టమ్‌ను టాటా కర్వ్‌లో ఏర్పాటుచేసినట్లు పేర్కొంది. పానరోమిక్‌ సన్‌రూఫ్‌, పవర్డ్‌ టెయిల్‌ గేట్‌, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్‌ డ్రైవర్‌ సీటు, వైర్‌లెస్‌ చార్జర్‌, ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, స్టార్ట్‌-స్టాప్‌ బటన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. బర్గండీ ఇంటీరియర్స్‌ను ఇచ్చారు. అల్ట్రా ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, టచ్ క్లైమేట్ కంట్రోల్‌తో డాష్‌బోర్డ్‌ ఉంది. దీని ఇంటీరియర్‌ వైట్‌ మరియు గ్రే కలర్‌తో వస్తుంది. ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్‌ కలదు. ఇక టాప్ వేరియంట్‌లో లెథెరెట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 320W JBL సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. దీనిలో 500-లీటర్ల భారీ బూట్‌ స్పేస్‌ని కలిగి ఉంది.

ఇంకా.. 6 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, వెనక 2-పొజిషన్ రిక్లయిన్‌ సీట్‌ కలదు. ఈ కారు ఎకో, సిటీ, స్పోర్ట్ డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. ఇది V2V, V2L ఛార్జింగ్‌ను ఆప్షన్‌ని కలిగి ఉంది. మొదట ఈ ఆప్షన్‌ Nexon EVలో అందించబడింది. Tata Curvv EV 18-ఇంచెస్‌ వీల్‌, 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 450 mm వాటర్ వేడింగ్ డెప్త్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా కర్వ్‌ టాటా Curvv ICE ఇంజిన్ ఆప్షన్‌లోకి అందుబాటులో ఉండనుంది. ఇందులో రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్‌ ఉన్నాయి. వీటిలో కొత్త హైపెరియన్ (Hyperion) GDi ఇంజిన్ కూడా ఉంది. ఇది 125 hp మరియు 225 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పాటు అప్‌డేటెడ్‌ 1.5-లీటర్ క్రయోటెక్ డీజిల్ యూనిట్‌ని అందించారు. ఈ 1.5 లీటర్‌ క్రయోటెక్‌ డీజిల్‌ ఇంజిన్‌ 115 హెచ్‌పీ ఎనర్జీ, 260 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్లాక్‌, గ్రే ఇంటీరియర్స్‌ను ఇచ్చారు. ఐసీఈ వెర్షన్ల ధరను సెప్టెంబరు 2న ప్రకటిస్తామని టాటా మోటార్స్‌ సంస్థ పేర్కొంది.

Tags:    

Similar News